Wahab Riaz On IND VS ZIM : పొద్దునే లేస్తే చాలు, టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, కోచ్‌లు, కెప్టెన్లు విషం కక్కుతూనే ఉంటారు. టీమిండియా గెలిస్తే ఫిక్సింగ్, ఓడిపోతే ఫ్లాట్ పిచ్‌లపైనే ఆడతారంటూ హేళన చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా జింబాబ్వేపై తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టును కూడా పాక్ కుక్కలు వదలలేదు. జింబాబ్వేను చీటింగ్, బెదిరింపులకు గురి చేసి.. టీమిండియా గెలిచిందని పాకిస్తాన్ మహిళల జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో జింబాబ్వే ప్లేయర్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని ఆశ చూసి, భారత పర్యటనకు తీసుకొచ్చారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రతీకా, షెఫాలీ వర్మ బ్యాట్లలో AI చిప్స్ ఉన్నాయని, వెంటనే ఐసీసీ చెక్ చేయాల్సిందేనని పాకిస్తాన్ మహిళల జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ డిమాండ్ చేశారు. డబ్బులు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు ఆశపడి జింబాబ్వే ఓడిపోతోందని ఆరోపణలు చేశారు. ఇప్పటికే టీ20లు ఓడిన జింబాబ్వే, వన్డే సిరీస్ కూడా కోల్పోతుందని బాంబ్ పేల్చారు. స్మృతి మందానకు తొలి సిరీస్ అయిన తరుణంలో పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడిస్తున్నారన్నారు. పెద్ద జట్లతో ఆడితే టీమిండియా ఓడిపోతుందని, ఈ తరుణంలోనే స్మృతి మందానను కెప్టెన్‌గా నియామకం చేసిన బీసీసీఐపై విమర్శలు వస్తాయన్నారు. అందుకే ఇలాంటి పసికూనలతో ప్లాన్ వేశారన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో టీమిండియా, జింబాబ్వే సిరీస్‌లపై వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వడోదర వేదికగా జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ప్రతీకా రావల్ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 27.1 ఓవర్లలో ఒకే ఒక వికెట్ నష్టపోయి చేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తో లీడింగ్‌లోకి వచ్చింది. ఇక జింబాబ్వే, టీమిండియా మధ్య రెండో వన్డే అక్టోబర్ 25వ తేదీన ఇదే వేదికగా జరుగనుంది. వడోదర మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీకా రావల్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 96 బంతుల్లో 15 బౌండరీలతో తన కెరీర్‌లో మూడో వన్డే సెంచరీ నమోదు చేసుకుంది. కొత్త కెప్టెన్ స్మృతి మందాన 32 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 64 పరుగులు చేసి ఇరగదీసింది. ఈ దెబ్బకు 27.1 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ప్రతీకా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. శ్రీ చరణి 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వే నడ్డివిరిచింది. క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించారు.