E-Paper
Advertisement

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం
Advertisement

Wahab Riaz On Asia Cup 2026:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య నిన్న బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు… పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ వాహాబ్ రియాజ్ (Wahab Riaz) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చేతిలో ఓడిపోయినంత మాత్రాన.. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఆసియా కప్ 2026 ట్రోఫీ మాత్రం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో వాహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు వైర‌ల్ గా మారాయి.

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 55 పరుగులకు ఆల్ అవుట్ కావడంపై కోచ్ వాహాబ్ రియాజ్ (Wahab Riaz) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో తాము ఓడిపోయినప్పటికీ.. అంతిమ విజయం పాకిస్తాన్ దే అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

తమ జట్టులో ప్లేయర్లు అందరూ మంచి ప్రతిభ ఉన్నవారే… వాళ్లు తమపై తాము నమ్మకం ఉంచాలని తెలిపారు. తమ తర్వాతి మ్యాచ్ హంకాంగ్ తో ఉందని వివరించారు వాహాబ్ రియాజ్. అందులో కచ్చితంగా గెలుస్తామని పేర్కొన్నారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన తప్పిదాలను సమీక్షించుకుంటామని ప్రకటించారు. ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ… ఆసియా కప్ గెలుస్తామని సంచలన ప్రకటన చేశారు. దుబాయ్ పరిస్థితులు తమ జట్టుకు బాగా అనుకూలిస్తాయని.. ఆసియా కప్ గెలిచే దిశగా అడుగులు వేస్తామని వివరించారు వాహాబ్ రియాజ్.

పాకిస్తాన్ జ‌ట్టుపై సనా మీర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మాజీ పాకిస్తాన్ ప్లేయర్ సనా మీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను తప్పించి భారీ మార్పులు చేయడంపై మాజీ కెప్టెన్ సనా మీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ క్రికెటర్లు లేకుండా అసలు మ్యాచ్ లు ఎలా గెలుస్తారని ఆమె నిలదీశారు. అయితే ఈ వ్యాఖ్యలకు వహాబ్ రియాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

 

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

Big Stories

Advertisement
×