E-Paper
Advertisement

SRHకు బిగ్ షాక్‌, అభిషేక్ శ‌ర్మ క్యాచ్ పై వివాదం..తెర‌పైకి మ‌ళ్లీ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు

SRHకు బిగ్ షాక్‌, అభిషేక్ శ‌ర్మ క్యాచ్ పై వివాదం..తెర‌పైకి మ‌ళ్లీ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు
Advertisement

Abhishek Sharma Catch Controversy:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament 2026) భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ ( Kolkata Knight Riders vs Sunrisers Hyderabad) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఇందులో టాస్ ఓడిపోయి, మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్, భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ క్రమంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) నాటౌట్ అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు రచ్చ‌ రచ్చ చేస్తున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా క్లాసెన్ ఔట్ అయినట్టుగానే… కేకేఆర్ తో మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ అచ్చం అలాగే ఔట్ అయ్యాడు. దీంతో ఈ క్యాచ్ పై వివాదం రాజకుంది. ఈ తరుణంలోనే ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

అభిషేక్ శర్మ వికెట్ పై వివాదం.. తప్పుడు నిర్ణయం తీసుకున్నారా ?

Advertisement

కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ 48 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజారాబానీ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తికి ( Varun Chakaravarthy ) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. అయితే వరుణ్ చక్రవర్తి అందుకున్న ఈ క్యాచ్ ( Abhishek Sharma Catch Controversy) వివాదంగా మారింది. క్యాచ్ పట్టడానికి ముందు బంతి నేలకు త‌గిలింద‌ని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. థర్డ్ అంపైర్ రివ్యూలో కూడా అలాగే కనిపించింది. కానీ అంపైర్లు మాత్రం అభిషేక్ శర్మ ఔట్ అంటూ ప్రకటించారు. ఈ తరుణంలోనే అంపైర్లు అమ్ముడుపోయారని.. ఈ మ్యాచ్ కూడా ఫిక్సింగ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

భారీ స్కోర్ సాధించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన సన్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ 226 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు హెడ్ 46 పరుగులు సాధించగా అభిషేక్ శర్మ 48 పరుగులతో రెచ్చిపోయారు. అయితే వీళ్ళు ఔట్ అయిన తర్వాత సన్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ కాటేరమ్మ కొడుకు క్లాసెన్ 52 పరుగులతో రాణించాడు. అటు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి 39 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ 226 పరుగులు సాధించింది. ఇక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 227 పరుగులు చేస్తే కేకేఆర్ విజయం సాధిస్తుంది.

Advertisement

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×