E-Paper
Advertisement

Ganga Jalam: ఇంట్లో గంగాజలాన్ని ఇలా ఉంచితే ఇంటికి మంచిది కాదు

Ganga Jalam: ఇంట్లో గంగాజలాన్ని ఇలా ఉంచితే ఇంటికి మంచిది కాదు
Advertisement

మన ఇళ్లలో గంగాజలం పెట్టుకుంటే ఎంతో మంచిదని చెబుతారు. గంగాజలం దేవతల ఆశీర్వాదం లాంటి నీరు అని పెద్దలు చెబుతారు. అందుకే దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఎలా వాడాలి? అన్న విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. సరైన రీతిలో ఉంచితే ఇంట్లో శాంతి, సానుకూలత పెరుగుతాయని నమ్మకం. కానీ నిర్లక్ష్యంగా ఉంచితే దాని పవిత్రత తగ్గిపోతుందని భావిస్తారు. అందుకే పూజ గదిలో గంగాజలం పెట్టుకునే వారు పాటించాల్సిన ఐదు నియమాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే గంగాజలం శుభంగా, పవిత్రంగా ఎక్కువ రోజులు ఉంటుంది.

పాత్ర శుభ్రత
మొదటగా గంగాజలాన్ని ఉంచే పాత్ర చాలా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా కాంస్యం లేదా వెండి పాత్రలు ఉత్తమం. ఇవి శుభశక్తిని నిల్వచేస్తాయని నమ్మకం. సాధారణంగా ప్లాస్టిక్ బాటిల్‌లలో లేదా ఇంతకుముందు వాడిన గిన్నెల్లో ఉంచకూడదు. ఎందుకంటే అవి నీటి పవిత్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఈ పాత్రను నేలమీద ఉంచకూడదు. పూజ గదిలో ఉండే ఒక పీటపై లేదా షెల్ఫ్‌పై ఉంచాలి. నేల దగ్గర, పాదాల దగ్గర ఉంచడం చాలా తప్పుడు. ఎత్తయిన చోట ఉంచితే మంచి శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది.

Advertisement

గంగాజలాన్ని ముట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల్లో దుమ్ము, ఆయిల్ లేదా ఏదైనా దుర్వాసన ఉంటే అది నీటి పవిత్రతకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే గంగాజలం తీసే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగే చాలా మంది గంగాజల బాటిల్‌లో నీరు తక్కువైతే పైగా సాధారణ నీరు పోసి ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే సాధారణ నీటితో కలిస్తే గంగాజల పవిత్రత తగ్గిపోతుందని నమ్మకం. కాబట్టి నీరు తగ్గితే కొత్త గంగాజలం వచ్చే వరకు వేచి ఉండటం ఉత్తమం.

పూజ గది ఎలా ఉండాలి?
గంగాజలాన్ని ఉంచిన ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పూజ గదిలో ధూళి, పాత వస్తువులు, బట్టలు, పేపర్లు ఇలా ఏమీ ఉండకూడదు. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో గంగాజలం ఉంచితే ఇంట్లో కూడా మంచి సానుకూల శక్తి ఏర్పడుతుంది. పూజ గది ఎప్పుడూ సైలెంట్‌గా, శుభ్రంగా, మంచి వాసనతో ఉండేలా చూసుకుంటే మంచిది. ఇలా ఈ ఐదు సులభమైన నియమాలు పాటిస్తే గంగాజలాన్ని సత్కారంగా, గౌరవంగా ఉంచినట్లవుతుంది. దాంతో మీరు ఇంట్లో దీని పవిత్రత, శాంతి, శుభఫలితాలను మరింతగా అనుభవించగలరు.

Advertisement

భారతదేశంలో గంగాజలానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గంగా నదిని పవిత్రమైనదిగా చెప్పుకుంటారు. ఆ నది నీరు ఇంట్లో ఉంటే శుభం, ఆరోగ్యం, శాంతిని తీసుకువస్తుందని నమ్మకం. పూజలు, హోమాలు, శాంతి కార్యక్రమాల్లో గంగాజలం తప్పనిసరిగా వాడతారు. దీని ద్వారా నెగెటివ్ ఎనర్జీ తగ్గి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతారు. గంగాజలాన్ని శుభ్రమైన పాత్రలో, పరిశుభ్రమైన పూజ గదిలో ఉంచడం ఆనవాయితీ. ఆధ్యాత్మికంగా, సాంప్రదాయకంగా గంగాజలాన్ని దేవతల ఆశీర్వాదంగా భావించి, ప్రతి ఇంటిలో ఎంతో భక్తితో దాచుకుంటారు.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×