E-Paper
Advertisement

Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?
Advertisement

Suryakumar-chewing gums: టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత టీమిండియాలోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. లేటు వయసులో అయిన సరే జట్టును లీడ్ చేస్తూ ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీ కూడా భారత జట్టుకు అందించాడు సూర్య కుమార్ యాదవ్. అంతకు ముందు డిసెంబర్ లో టి20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా టీమిండియాను ఛాంపియన్ గా నిలిపాడు సూర్య భాయ్. ఇలా టీ20 లలో టీమిండియా ఏ టోర్నమెంట్ ఆడినా సరే, ఛాంపియన్ గా నిలుస్తోంది. అయితే అలాంటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నమిలే చూయింగ్ గమ్ ( chewing gums) గురించి సోషల్ మీడియాలో జోరుగా ఓ వార్త ప్రచారం సాగుతోంది. ప్రతి రోజు సూర్యకుమార్ యాదవ్ దాదాపు 500 చూయింగ్ గమ్ లు నములుతాడ‌ని అంటున్నారు. ఇక వాటికి అయ్యే ఖ‌ర్చు అంతాను భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) భరిస్తుందని ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read: TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

రోజుకు 500 చూయింగ్ గమ్ లు నములుతున్న సూర్య కుమార్ యాదవ్

Advertisement

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రతిసారి చూయింగ్ గమ్ లు నములుతూ కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ జరిగినప్పుడు అయితే, ఓ మిషన్ నడిచినట్టే అతని నోరు చూయింగ్ గమ్ లను నములుతూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతనిపై అనేక రకాల మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. చింపాంజీ లాగా నమ్ముతున్నాడని వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ ఒక్కరోజులో 500 చూయింగ్ గమ్ లు నములుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు నమిలే ఒక్క చూయింగ్ గమ్ ధర 50 రూపాయలు ఉంటుందని కలుస్తోంది. అంటే ఒక్కరోజులో 25వేల రూపాయల చూయింగ్ గమ్ లు సూర్య భాయ్ నములు తాడన్నమాట. అంటే ఏడాదిలో ఈ చూయింగ్ గమ్ ల ఖర్చు రూ.7.5 లక్షలు అని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఖర్చు పూర్తిగా బీసీసీఐ భరిస్తుందని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. రోజుకు 500 చూయింగ్ గమ్ లు అంటే మూడు నిమిషాలకు ఒకటి నమలాలి. రోజులో 24 గంటలు ఉంటాయి కాబట్టి, అందులో పడుకోవడానికి కనీసం 6 గంటలు తీసేసినా, ఒక్కరోజులో 500 చూయింగ్ గమ్ లు నమలడం కష్టమే అని అంటున్నారు. ఇదంతా ఫేక్ ప్రచారమని కౌంటర్ ఇస్తున్నారు జనాలు. అయితే మ్యాచ్ జరిగే సందర్భంగా మాత్రం సూర్య కుమార్ యాదవ్ ఎక్కువగా చూయింగ్ గమ్ లు నములుతాడని చెబుతున్నారు.

అసలు ఎందుకు చూయింగ్ గమ్ లు క్రికెటర్లు నములుతారు ?

Advertisement

సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే కాదు చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూయింగ్ గమ్ లు నములుతూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా చూయింగ్ గమ్ లు నమిలితే, మ్యాచ్ పైన ఏకాగ్రత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే నోటి ఎక్ససైజ్ కూడా దీని ద్వారా జరుగుతుంది. మ్యాచ్ జరిగే సమయంలో వీటిని నమలడం వల్ల, ఎక్కువగా ఫోకస్ చేసి క్రికెట్ బాగా ఆడతారని చెబుతున్నారు.

Also Read:  MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×