E-Paper
Advertisement

WPL 2026 Schedule: జ‌న‌వ‌రి 9 నుంచే WPL 2026..సార్ట్ ప్లేయ‌ర్లు దూరం, షెడ్యూల్, టైమింగ్స్‌ ఇదే, ఫ్రీగా చూడాలంటే

WPL 2026 Schedule: జ‌న‌వ‌రి 9 నుంచే WPL 2026..సార్ట్ ప్లేయ‌ర్లు దూరం, షెడ్యూల్, టైమింగ్స్‌ ఇదే, ఫ్రీగా చూడాలంటే

WPL 2026 Schedule:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Womens Premier League 2026  ) ముహూర్తం ఖరారైంది. జనవరి 9వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ), ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ( Delhi Capitals) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ రెండు జట్లకు సంబంధించిన స్టార్ ప్లేయర్లు దూరం కాబోతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ ఎల్లిస్ పెర్రీ ( ELLYSE PERRY), అన్నాబెల్ సదర్ ల్యాండ్ వ్యక్తి గత కారణాల వల్ల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు దూరం కాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఢిల్లీతో పాటు ఆర్సిబి జట్లకు ఊహించని దెబ్బ తగిలింది. అయితే వాళ్ల స్థానంలో మరో ఇద్దరు కొత్త ప్లేయర్లు రాబోతున్నారు. ఇద్దరు ప్లేయర్లతో పాటు తార నోరిస్ కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చార్లీ నాట్ రంగంలోకి దిగ‌నున్నారు.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

WPL 2026 షెడ్యూల్, టైమింగ్స్‌ ఇదే, ఫ్రీగా చూడాలంటే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 Schedule ) ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 9వ తేదీ 2026 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దాదాపు నెల రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో మొత్తం 22 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. నవీ ముంబై, వడోదర వేదికలలో మాత్రమే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జరగనుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు స్టేడియాలను మాత్రమే సెలెక్ట్ చేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లోని మొదటి పదకొండు మ్యాచ్ ల‌కు నవీ ముంబై వేదికగా కానుంది. అంటే జనవరి 9వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు నవీ ముంబైలో జరుగుతాయి. మిగిలిన 11 మ్యాచులు అంటే ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ లు వడోదర వేదికగా జరగనున్నాయి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులు మొత్తం జియో హాట్ స్టార్ దక్కించుకుంది. జియో హాట్ స్టార్ తో పాటు స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు ఉచితంగా తిలకించవచ్చు.

మొదటి మ్యాచ్ ఎవరి మధ్య అంటే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రారంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఫిబ్రవరి 3వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×