E-Paper
Advertisement

Indian Railway: హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే విజయవాడకు.. రైల్వే సరికొత్త ప్లాన్!

Indian Railway: హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే విజయవాడకు.. రైల్వే సరికొత్త ప్లాన్!

SCR Golden Diagonal Corridor: సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) హైదరాబాద్-విజయవాడ మార్గంలో రైలు స్పీడ్‌ను పెంచేందుకు సరికొత్త ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ఈ పెంపునకు సంబంధించి కొత్త ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ఈ ప్లాన్ ప్రకారం.. గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్‌ గా అప్ గ్రేడ్ చేయాలని భావిస్తుంది. ఈ అప్ గ్రేడ్ తర్వాత రైళ్లను 160 కిమీ/గం వేగంతో నడపాలని నిర్ణయించింది. ఇది సౌత్ ఇండియాలో తొలి సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ గా గుర్తింపు పొందనుంది.

ప్రస్తుత పరిస్థితి, ప్రతిపాదిత మార్పులు

⦿ ప్రస్తుత ట్రావెల్ టైమ్: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లడానికి సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు 4 నుంచి 5 గంటల సమయం తీసుకుంటున్నాయి. వందే భారత్, దురంతో లాంటి ప్రీమియం రైళ్లు కూడా సుమారు 4 గంటలు తీసుకుంటున్నాయి.

⦿ ప్రతిపాదిత ట్రావెల్ టైమ్: అప్‌గ్రేడ్ తర్వాత.. సుమారు 350 కి.మీ ఉన్న ఈ ప్రయాణం కేవలం 3 గంటల లోపు పూర్తవుతుంది. ఇది ఎయిర్ ట్రావెల్‌ సమానంగా ఉండబోతోంది.

⦿ స్పీడ్ అప్‌గ్రేడ్: ప్రస్తుతం 130 కిమీ/గం వరకు ఉన్న స్పీడ్‌ను 160 కిమీ/గం కు పెంచుతారు. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (GQ), ఇతర హై-డెన్సిటీ మార్గాల్లో భాగం కానుంది.

⦿ కవర్ అయ్యే సెక్షన్లు: సికింద్రాబాద్-కాజీపేట్, కాజీపేట్-విజయవాడ, దువ్వాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు లాంటి కీలక సెక్షన్లు. ఈ సెక్షన్లలో ఇప్పటికే వందే భారత్, రాజధాని, దురంతో లాంటి ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి.

టైమ్‌లైన్, అమలు 

హైదరాబాద్- విజయవాడ మార్గాన్ని గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్‌ గా అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కేంద్రానికి పంపారు. ఆమోదం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఆమోదం వచ్చిన తర్వాత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్‌ను 2 సంవత్సరాలలోపు పూర్తి చేస్తారు. SCR ఇప్పటికే 2022-23లో పలు మార్గాలను 130 కిమీ/గం కు అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 6,560 కి.మీ. నెట్‌ వర్క్‌ లో 1,834 కి.మీ. ఇప్పుడు 130 కిమీ/గం కు అనుకూలంగా మారింది.  ఈ కొత్త ప్లాన్‌లో సుమారు 2,500 కి.మీ. మార్గాలను 160 కిమీ/గం కు అప్‌గ్రేడ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.

గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్‌ తో లాభాలు

⦿ వేగవంతమైన ప్రయాణం: గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్‌ తో 350 కి.మీ. దూరం ఉన్న ఈ మార్గంలో రైలు ప్రయాణం ఎయిర్ ట్రావెల్‌తో సమానంగా మారుతుంది, ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్ సమయాలను పరిగణలోకి తీసుకుంటే రైలు మరింత సౌకర్యవంతం కానుంది.

⦿మరిన్ని రైళ్లు: హై డెన్సిటీ మార్గాల్లో మరిన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.

⦿ సౌత్ ఇండియాలో ఫస్ట్ రూట్: ఇప్పటి వరకు 160 కిమీ స్పీడ్ తో వెళ్లే మార్గాలు నార్త్ ఇండియాలో ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-మీరట్ మధ్య మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్- విజయవాడ మార్గంలో రానుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని బూస్ట్ చేస్తుంది.

మరో సెమీ హై-స్పీడ్ రైల్ కారిడార్

ఇటీవల మరో సెమీ హై-స్పీడ్ రైల్ కారిడార్ (హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం)కు ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం వచ్చింది. ఇది సూర్యాపేట్ మీదుగా నడుస్తుంది, స్పీడ్ గంటకు 220 కిమీ ఉంటుంది. హైదరాబాద్-విశాఖపట్నం (సుమారు 700 కి.మీ.) మధ్య ప్రయాణం కేవలం 4.5 గంటల్లో పూర్తవుతుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణం సుమారు 2.5 గంటల్లో పూర్తి కానుంది. ఈ రెండు ప్లాన్‌లు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, రైలు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం అవుతుంది.

Read Also: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×