Hulk Hogan Died: ప్రపంచ రెజ్లింగ్ ప్రియులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ మృతి చెందారు. 71 సంవత్సరాలు ఉన్న హల్క్ హొగన్… కాసేపటి క్రితమే మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనకు గుండెపోటు రావడంతో… మరణించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ రెజ్లింగ్ క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ( Hulk Hogan Died )
గుండెపోటుతో హల్క్ మృతి
దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్.. గురించి తెలియని వారు ఉండరు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో హల్క్ కోసమే రెజ్లింగ్ చూసే ఉండేవారన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్.. తాజాగా మృతి చెందారు. 71 సంవత్సరాలు ఉన్న ఆయన గుండెపోటుతో అమెరికాలోని ఫ్లోరిడాలో తన నివాసంలో మృతి చెందారు హల్క్. 1953 సంవత్సరంలో జన్మించిన ఆయన… రెజ్లర్ గా ఎన్నో విజయాలను అందుకున్నారు. అదే సమయంలో ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు హల్క్. 1980లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్ లలో ఒకరిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.
ఐదుసార్లు WWF ఛాంపియన్ గా సరికొత్త చరిత్ర
దిగ్గజా రెజ్లర్ హల్క్ హోగన్ ఛాంపియన్ గా చాలా సార్లు నిలిచారు. తన కెరీర్ లో మొత్తం ఐదు సార్లు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఛాంపియన్ గా కూడా ఆయన నిలవడం జరిగింది. 1977 సంవత్సరంలో ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్ ప్రారంభించారు హల్క్ హోగన్. అయితే 1983 సంవత్సరంలో… వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత హల్క్ కెరీర్ మొత్తం మారిపోయింది. ప్రపంచ స్థాయిలో అతని పేరు మార్మోగింది.
1977 సంవత్సరం నుంచి 2005 వరకు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో కొనసాగాడు హల్క్. ఇక ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకొని.. హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరాడు. ఇక హల్క్ పర్సనల్ విషయానికి వస్తే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు బ్రూక్ కాగా మరొకరు నిక్ హోగన్. అతనికి మేనల్లుడు హోరేశ్ కూడా ఉన్నారు. ప్రొఫెషనల్ రెజ్లర్, అలాగే నటుడిగా, సంగీత కారుడిగా కూడా రాణించాడు.
ఇది ఇలా ఉండగా ప్రముఖ రెజ్లర్ హల్క్ మృతి చెందిన నేపథ్యంలో… ఆయన అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ఆయన మరణ వార్త వినగానే కంగు తింటున్నారు. అలాగే ఆయన మృతి నేపథ్యంలో… ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు ప్రస్తుత రెజ్లర్లు అటు మాజీ రెజ్లర్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ… హల్క్ ఆత్మకు శాంతి చేకూరాలని అంటున్నారు.