Sai Sudarshan: ఇంగ్లాండ్ తో బుధవారం రోజు ప్రారంభమైన 4వ టెస్టులో టీమిండియాకి మంచి శుభారంభం లభించింది. గత మూడు టెస్ట్ ల తరహాలో ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ విషయం తెలిసిందే. అయితే నాలుగోవ టెస్ట్ మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 61, యశస్వి జైష్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, రిషబ్ పంత్ 37 {రిటైర్డ్ హర్ట్} పరుగులు చేశారు.
Also Read: Azam Khan: 69 కిలోలు తగ్గిన పాకిస్తాన్ వికెట్ కీపర్.. మొత్తం బీఫ్ తినడం మానేశాడా!
ఇక రవీంద్ర జడేజ 19, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఫామ్ లో లేని కరుణ్ నాయర్ ని తప్పించి.. సాయి సుదర్శన్ ని జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఇక సాయి సుదర్శన్ కట్టుదిట్టమైన డిఫెన్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ ని స్టోక్స్ క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేర్చాడు. కాగా మ్యాచ్ కి ముందు రోజు అయిన మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ పక్కగా వెళ్తూ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తావా..? అని అడిగాడు. ఇలా అడిగితే ఏ ఆటగాడైనా అవుననే చెబుతాడు. కానీ సాయి సుదర్శన్ మాత్రం అందుకు నిరాకరించాడు. కానీ గిల్ మాత్రం అస్సలు కోపగించుకోలేదు. ఎందుకంటే మ్యాచ్ కి ఒకరోజు ముందు సాయి సుదర్శన్ నెట్స్ లో బ్యాటింగ్ చేయడనే విషయం గిల్ కి తెలుసు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సందర్భంగా అతడు మ్యాచ్ కి ఒక రోజు ముందు నెట్స్ లో బ్యాటింగ్ చేయడం మానేశాడు.
ఐపీఎల్ లో కూడా గిల్ అతడికి కెప్టెన్ అయినందువల్ల.. ఈ విషయం గిల్ కి బాగా తెలుసు. మైదానంలో ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం వల్ల సాయి సుదర్శన్ అలసిపోయినట్లు భావించాడు. ఈ విషయాన్ని గమనించిన గుజరాత్ టైటాన్స్ కోచ్ లు.. మ్యాచ్ కి ఒకరోజు ముందు విశ్రాంతి తీసుకోవాలని సాయి సుదర్శన్ కి సలహా ఇచ్చారు. దీని ఫలితం సానుకూలంగా వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో అతడు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హెడింగ్లీ లో జరిగిన తొలి టెస్ట్ లో అరంగేట్రం చేశాడు సాయి సుదర్శన్. తొలి ఇన్నింగ్స్ లో పరుగులు ఏమి చేయకుండానే అవుట్ అయ్యాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు.
Also Read: Yashasvi Jaiswal: బ్యాట్ విరగ్గొట్టిన యశస్వి జైస్వాల్ .. ఇదిగో వీడియో
ప్రస్తుతం జరుగుతున్న నాల్గవ టెస్ట్ లో 61 పరుగులు చేశాడు. అయితే సాయి సుదర్శన్ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత బ్యాటింగ్ సమయంలో సాయి సుదర్శన్ క్రీజ్ లోకి రాకముందు ఓ బుక్ లో ఏదో రాశాడు. ఆ తరువాత దానిని వాషింగ్టన్ సుందర్ పరిశీలించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. “ఏంట్రా మీ ఇద్దరి గోల.. ముందు భారత జట్టును గెలిపించండి. ఆ పుస్తకంలో ఏం చూస్తున్నారు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Me and my bro, 2 min before exam starts: https://t.co/nOfKem7suM
— Out Of Context Cricket (@GemsOfCricket) July 23, 2025