Rishabh Pant Injury: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సిరీస్ నేపథ్యంలో… ఇవాల్టి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. మంచేస్టర్ వేదికగా ఈ నాలుగో టెస్టు ఇవాళ మూడున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా… ఆచితూచి ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… మొదటి రోజు నాలుగు వికెట్ల నష్టపోయి 264 పరుగులు చేసింది. అయితే మొదటి రోజునే.. టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్… మూడో టెస్ట్ తరహాలోనే నాలుగో టెస్ట్ లో కూడా గాయపడ్డాడు. దీంతో అతన్ని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
Also Read: BAN VS PAK: 4 గురు డకౌట్…30 పరుగులకే 6 వికెట్లు… పాకిస్థాన్ ఇజ్జత్ మొత్తం పాయె.. ఇక గంగలో దూకేయండి
మొదటి రోజునే గాయపడ్డ రిషబ్ పంత్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా నే మొదటి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొదట ఇద్దరు ఓపెనర్లు అద్భుతంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇంతలోనే టీమ్ ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కాలికి… తీవ్రమైన గాయం అయింది. క్రిస్ వోక్స్ వేసిన అద్భుతమైన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయాడు రిషబ్ పంత్. ఇంతలోనే… పంత్ పాదానికి తీవ్రమైన గాయమైంది. దెబ్బ తగలగానే నొప్పితో విలవిల్లాడుతూ… రిషబ్ పంత్ నడవలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్.. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం అతన్ని ప్రత్యేక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రిషబ్ పంత్ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత రవీంద్ర జడేజా…క్రిజులోకి రావడం జరిగింది.
రాణించిన టీమిండియా ఓపెనర్లు
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా.. అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఇందులో యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 46 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా రాణించాడు. 60 కి పైగా పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ అలాగే రవీంద్ర బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి.. నాలుగు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 264 పరుగులు చేసింది. ఇక ఇదే ఊపును రేపు కూడా కొనసాగించి… 400కు పైగా టీమిండియా స్కోర్ చేస్తేనే.. మ్యాచ్ మన చేతిలో ఉంటుంది. అలా కాదని టీమిండియా 300 పరుగులు చేసి ఆలౌట్ అయితే.. గెలవడం చాలా కష్టం అవుతుంది.
Also Read: Sai Sudharsan: మాంచెస్టర్ లో భారీ వర్షం… కవర్స్ ఉండగానే బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్
Rishabh Pant being taken to the hospital in an ambulance.
Hope everything is fine.#INDvsENG #AskStar#RishabhPant pic.twitter.com/YNPo3euuXC
— अनामिका 🦋 (@nityaa78) July 23, 2025