OTT Movie : వెబ్ సిరీస్ లు సరికొత్త స్టోరీలతో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక కోర్ట్‌రూమ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ న్యాయవ్యవస్థలోని లోపాలను, న్యాయమూర్తులు, పోలీసులు, లాయర్ల తప్పిదాలను హైలైట్ చేస్తుంది. దీనిని చూసేవాళ్ళకి “కోర్టు సరైన తీర్పు ఇచ్చిందా?” అని ఆలోచించేలా చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘Justice on Trial’ 2025 లో విడుదలైన అమెరికన్ ట్రూ-క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా టీవీ సిరీస్. జూడీ షీండ్లిన్ దీనిని రూపొందించారు. ఈ సిరీస్ 2025 జూలై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 ఎపిసోడ్‌లతో ప్రీమియర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఇది స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇందులో జడ్జి జూడీ తన లీగల్ టీమ్‌తో కలిసి, అమెరికన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని 8 ల్యాండ్‌మార్క్ కేసులను రీ-ఎనాక్ట్‌మెంట్స్, కోర్ట్ ట్రాన్స్‌క్రిప్ట్స్, న్యూస్ ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తాడు. ఈ సిరీస్ జస్టిస్ సిస్టమ్ లోటుపాట్లను, న్యాయం సరిగ్గా జరిగిందా అనే ప్రశ్నలను లేవనెత్తుతూ, వీక్షకులనే సరైన నిర్ణయం తీసుకోమని చెప్తుంది. ఇది IMDbలో 6.3/10 రేటింగ్ ను కలిగి ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ అమెరికన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని 8 ముఖ్యమైన, వివాదాస్పద కేసులను ఫోకస్ చేస్తుంది. ఇవి 340 మిలియన్ అమెరికన్ల జీవితాలను ప్రభావితం చేశాయి. జడ్జి జూడీ షీండ్లిన్, తన లీగల్ ఎక్స్‌పర్ట్ టీమ్‌తో, ఈ కేసులను కోర్ట్ ట్రాన్స్‌క్రిప్ట్స్, రీ-ఎనాక్ట్‌మెంట్స్, న్యూస్ ఫుటేజ్ ద్వారా నేరాల వివరాలను సేకరించి, కోర్టు తీర్పులు న్యాయమైనవా, చట్టం సరిగ్గా అమలైందా అని పరిశీలిస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఒక నిర్దిష్ట కేసును కవర్ చేస్తుంది.
వీటిలో కొన్ని థీమ్స్ ఇలా ఉన్నాయి
ఫస్ట్ అమెండ్‌మెంట్ (స్పీచ్ ఫ్రీడమ్): ఏ స్పీచ్ చట్టబద్ధం కాదు? దీని బౌండరీస్ ఎవరు నిర్ణయిస్తారు?
స్కూల్ కరికులమ్: పాఠశాలల్లో ఏం బోధించాలి? దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు?
సబ్జెక్టివ్ ఎవిడెన్స్: ఒక డెడ్ బాడీ ఎవిడెన్స్‌ను సప్రెస్ చేస్తే, మర్డరర్‌ను ఎలా విడిచిపెడతారు?
వివాదాస్పద తీర్పులు: కొన్ని కేసుల్లో చట్టం ప్రకారం తీర్పు ఇచ్చినా, అది న్యాయంగా అనిపించలేదని జూడీ చర్చిస్తుంది.
ఉదాహరణకు, ఒక ఎపిసోడ్‌లో 1990లో జరిగిన కామెరాన్ టాడ్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపిన కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటాడు. కానీ ఎలిజబెత్ గిల్బర్ట్ అతను నిర్దోషి అని నమ్మి, తీర్పును రివర్స్ చేయడానికి పోరాడింది. ఇలా ప్రతి ఎపిసోడ్ న్యాయవ్యవస్థలోని ఒక వివాదాస్పద అంశాన్ని డీల్ చేస్తూ, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
జడ్జి జూడీ స్వయంగా హోస్ట్‌గా, న్యాయమూర్తిగా కనిపిస్తూ, కేసులను విశ్లేషిస్తుంది. ఆమె తన లీగల్ టీమ్‌తో కలిసి, నిజమైన కోర్ట్ ట్రాన్స్‌క్రిప్ట్స్ ఆధారంగా రీ-ఎనాక్ట్‌మెంట్స్ చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ న్యూస్ ఫుటేజ్, ఇంటర్వ్యూలు, డ్రామాటిక్ రీ-క్రియేషన్స్‌తో నిండి ఉంటుంది. జూడీ తన కామెంటరీ ద్వారా కేసుల లోపాలను హైలైట్ చేస్తుంది. ఆమె చెప్పినట్లు న్యాయమూర్తులు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? న్యాయం జరగడానికి ఎంత సమయం పడుతుంది? జడ్జి జూడీ ప్రజలకు ఇచ్చే సూచనలు ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మనిషి నెత్తిపై మిస్టీరియస్ రెడ్ లైన్స్… ఈ ట్రెండింగ్ కొరియన్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?