BigTV English

HRRL Jobs: డిప్లొమా, బీటెక్ అర్హతలతో జాబ్స్.. రూ.లక్షల్లో వేతనం, డోంట్ మిస్

HRRL Jobs: డిప్లొమా, బీటెక్ అర్హతలతో జాబ్స్.. రూ.లక్షల్లో వేతనం, డోంట్ మిస్

HRRL: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, పీజీ, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగ వెకెన్సీలు, విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం తదితర వివరాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


హెచ్‌పీసీఎల్‌ రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (HRRL) రాజస్థాన్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 11వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 131


పలు విభాగాల్లో ఉద్యోగ వెకెన్సీలు ఉన్నాయి. సివిల్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, లీగల్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, ఆఫీసర్, హెచ్ఆర్, ఆఫీసర్ వెల్ఫేర్, ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 9 పోస్టులు

అసిస్టెంట్ ఇంజినీర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌, ఆఫీసర్‌ – వెల్ఫేర్‌: 20 పోస్టులు

ఇంజినీర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, మెడికల్ ఆఫీసర్‌, లీగల్ ఆఫీర్‌: 53 పోస్టులు

సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్: 21 పోస్టులు

సీనియర్‌ మేనేజర్‌: 28 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: జులై 11

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 11

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్‌కు 25 ఏళ్ల వయస్సు ఉండాలి. సీనియర్ మేనేజర్‌కు 42 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, లీగల్, ఇంజినీర్‌కు 29 ఏళ్ల వయస్సు ఉండాలి. సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, కంపెనీ సెక్రటరీ 34 ఏళ్లు ఉండాలి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ధారించారు. నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 – రూ. 1,20,000 జీతం ఉంటుంది అసిస్టెంట్ ఇంజినీర్‌ & అసిస్టెంట్ ఆఫీసర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ ఆఫీసర్‌కు రూ.40,000 – రూ.1,40,000, ఇంజినీర్‌ అండ్ ఆఫీసర్‌కు రూ.50,000 – రూ.1,60,000, సీనియర్‌ ఇంజినీర్‌ అండ్ సీనియర్‌ ఆఫీసర్‌కు రూ.60,000 – రూ.1,80,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://hrrl.in/Hrrl/current-openings.jsp

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 – రూ. 1,20,000 జీతం ఉంటుంది అసిస్టెంట్ ఇంజినీర్‌ & అసిస్టెంట్ ఆఫీసర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ ఆఫీసర్‌కు రూ.40,000 – రూ.1,40,000, ఇంజినీర్‌ అండ్ ఆఫీసర్‌కు రూ.50,000 – రూ.1,60,000, సీనియర్‌ ఇంజినీర్‌ అండ్ సీనియర్‌ ఆఫీసర్‌కు రూ.60,000 – రూ.1,80,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000 జీతం ఉంటుంది.

ALSO READ: NMDC LIMITED: డిగ్రీ పాసైతే చాలు భయ్యా.. రూ.2,60,000 జీతంతో ఉద్యోగాలు.. డోంట్ మిస్

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×