E-Paper
Advertisement

ఉస్మాన్ తారిక్ కు ఘోర అవ‌మానం..త్రో బౌలింగ్ అంటూ ప‌క్క‌కు జ‌రిగిన‌ డారిల్ మిచెల్

ఉస్మాన్ తారిక్ కు ఘోర అవ‌మానం..త్రో బౌలింగ్ అంటూ ప‌క్క‌కు జ‌రిగిన‌ డారిల్ మిచెల్
Advertisement

Daryl Mitchell vs Usman Tariq:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు పూర్తయ్యాయి. లేటెస్ట్ గా 18వ మ్యాచ్ క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ రావల్పిండిజ్ ( Quetta Gladiators vs Rawalpindiz ) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ 61 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉస్మాన్ తారిక్, డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) ఇద్దరు మధ్య చిన్నపాటి గొడవ కూడా చోటుచేసుకుంది. ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) బౌలింగ్ చేస్తుండగా, అతడిది త్రో బౌలింగ్ అంటూ పక్కకు జరిగాడు డారిల్ మిచెల్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, ఉస్మాన్ తారిక్ కు తగిన శాస్తి చేశాడని డారిల్ మిచెల్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

ఉస్మాన్ తారిక్ కు అవ‌మానం..త్రో బౌలింగ్ అంటూ ప‌క్క‌కు జ‌రిగిన‌ మిచెల్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ రావల్పిండిజ్ ( Quetta Gladiators vs Rawalpindiz ) మధ్య 18 వ మ్యాచ్ జరగగా, ఈ సందర్భంగా ఉస్మాన్ తారిక్ పరువు తీశాడు రావల్పిండిజ్ జట్టుకు సంబంధించిన డారిల్ మిచెల్. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఉస్మాన్ తారిక్, నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులు వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే అలాంటి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పక్కకు జరిగాడు డారిల్ మిచెల్.

రెండు సార్లు డారిల్ మిచెల్ కు బౌలింగ్ చేసేందుకు ఉస్మాన్ తారిక్‌, ప్రయత్నం చేశాడు. దీంతో రెండు సార్లు పక్కకు జరిగేసాడు డారిల్ మిచెల్. దీంతో చివరికి గట్టిగా బంతిని విసిరి తన కోపాన్ని వ్యక్తం చేశాడు ఉస్మాన్ తారిక్. ఈ తరుణంలోనే అంపైర్లు జోక్యం చేసుకొని.. డారిల్ మిచెల్ కు సర్ది చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్, ఉస్మాన్ తారిక్ ను ఉద్దేశించి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోనే వీడికి తగిన బుద్ధి చెప్పావ్ ? అంటూ డారిల్ మిచెల్ ను మెచ్చుకుంటున్నారు.

61 పరుగుల తేడాతో విజయం సాధించిన క్వెట్టా గ్లాడియేటర్స్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రావల్పిండిజ్ జట్టు పైన 18వ మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ సందర్భంగా రావల్పిండిజ్ జట్టు 17.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది.

 

 

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×