Yuzvendra Chahal- mistry girl: టీమిండియా స్పిన్నర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ జంట చాలాకాలంగా కలిసి కనిపించలేదు. ఇక ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ తన భార్యతో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ ఊహగానాలకు మరింత ఆజ్యం పోసింది.
Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?
అయితే వీరి విడాకుల రూమర్స్ పై ఇంతవరకు అటు ధనశ్రీ కాని, ఇటు చాహల్ కానీ ఎవరూ స్పందించలేదు. వీరి విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు దృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు..? అన్ని కారణాలు మాత్రం తెలియలేదు. అయితే ఈ రూమర్స్ పై చాహల్ తాజాగా ఇంస్టాగ్రామ్ లో మొదటిసారి స్పందించాడు. ” నిశ్శబ్దం లోతైన స్వరం, అన్ని శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినే వారికి అది ఎంతో అందమైన మెలోడీలా అనిపిస్తుంది” అన్న సోక్రటిక్ మాటలను కోట్ చేశారు.
దీంతో చాహల్ పోస్ట్ కి అర్థం ఏమై ఉంటుందని అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ చాహల్ మరో అమ్మాయితో {Yuzvendra Chahal- mistry girl} చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ కెమెరా కంట పడ్డాడు. ఇటీవల ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ లో ఓ అమ్మాయితో కనిపించాడు. తెలుపు రంగు ఓవర్ సైజ్ టీషర్ట్ ధరించిన చాహల్ కెమెరా కంట పడకుండా ఉండేందుకు చేతిని అడ్డంగా పెట్టుకున్నాడు.
కెమెరా కంట పడకుండా ఉండడానికి అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆ అమ్మాయితో కలిసి ఉన్న చాహాల్ {Yuzvendra Chahal- mistry girl} ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు అని, ధనశ్రీ తో ప్రేమాయణానికి ముందు ఆమె చాహల్ కి ప్రపోజ్ చేసినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఆ అమ్మాయి పేరు తనిష్క కపూర్ అని, ఆమె కన్నడలో రెండు సినిమాలలో నటించినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: ECB on ENG vs AFG: తాళిబన్ల అరాచకాలు.. ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం ?
ధనశ్రీ తో పరిచయం కాకముందే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే రూమర్స్ వచ్చాయి. కానీ గతంలో ఈ వార్తలను కొట్టిపారేశారు చాహల్. తనిష్క {Yuzvendra Chahal- mistry girl} తనకు స్నేహితురాలు మాత్రమేనని.. మాకు పెళ్లి జరగబోతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని కొట్టి పారేశారు. ముంబైలో జన్మించిన తనిష్క కపూర్ కన్నడలో రెండు సినిమాలలో నటించింది. 2015లో “ఫస్ట్ ర్యాంక్ రాజు” అనే చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">