ICC WTC final : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) ఫైనల్ కీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా తో తలపడడం ఖాయం. అయినప్పటికీ శ్రీలంక జట్టు ఫైనల్ లోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదు. శ్రీలంకకి ఈ అవకాశాన్ని ఆస్ట్రేలియా జట్టు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: ECB on ENG vs AFG: తాళిబన్ల అరాచకాలు.. ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం ?
కానీ ఓ భారీ తప్పిదం చేస్తేనే శ్రీలంక ఫైనల్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకుంది. అటు దక్షిణాఫ్రికా కూడా ఫైనల్స్ కి చేరింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {ICC WTC final} పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 69.44 % అగ్రస్థానంలో ఉంది. అలాగే ఆస్ట్రేలియా 63.73% తో రెండవ స్థానంలో ఉంది. కానీ ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్ మ్యాచ్ లు ఇక్కడితో ముగియకపోవడం విశేషం.
ఈ నెలాఖరులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు శ్రీలంకలో ఈ టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. భారత జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హెజిల్ వుడ్.. ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు.
శ్రీలంక సిరీస్ కి కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. మరోవైపు ఈ సిరీస్ కి ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమీన్స్ కూడా దూరం కానున్నాడు. అతని భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో అతడు శ్రీలంక టూర్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కి ఈ శిరీష్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీలంక 2-0 తో సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా స్కోర్ 57.02 శాతానికి పడిపోతుంది. ఇలా జరిగినప్పటికీ శ్రీలంక ఫైనల్స్ కి అర్హత సాధించదు.
Also Read: Shubman Gill – Ridhima Pandit: ఆ హీరోయిన్ తో గిల్ పెళ్లి.. ఇంతకీ ఎవరు ఈ రిద్దిమా?
కానీ శ్రీలంకతో జరిగే ఈ రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా స్లో ఓవర్ రేట్ తప్పిదం చేస్తే మాత్రం 8 పాయింట్లు కోల్పోవడం ఖాయం. దీంతో ఆస్ట్రేలియా జట్టు పర్సంటేజీ పాయింట్లలో మార్పు వచ్చి 2-0 తో సిరీస్ ని కోల్పోతే శ్రీలంక ఫైనల్స్ కి అర్హత పొందుతుంది. కానీ ఇలా జరగడం అసాధ్యం. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి పొరపాట్లు కూడా జరిగాయి. 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ 19 పాయింట్లు కోల్పోయింది. ఈ కారణంగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇలాంటి తప్పిదం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.