BigTV English

Nara Lokesh vs YS Jagan: చిచ్చుపెట్టకు.. విడాకులేం ఉండవు.. లోకేష్ క్లారిటీ

Nara Lokesh vs YS Jagan: చిచ్చుపెట్టకు.. విడాకులేం ఉండవు.. లోకేష్  క్లారిటీ

Nara Lokesh vs YS Jagan: చిచ్చుపెట్టకు.. విడాకులేం ఉండవు.. లోకేష్ క్లారిటీ ఏపీలో కూటమి పార్టీల్లో చేరికలు మిత్రపక్షాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పొలిటికల్ షెల్టర్ కోసం ఎన్టీయే పక్షాల్లో చేరడానికి పరితపిస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటూ వారికి కండువాలు కప్పేస్తున్నారు. అది ఆ పార్టీ శ్రేణులకే కాదు మిగిలిన వారికి మింగుడుపడటం లేదు. దాంతో పాలనాపరంగా మిత్ర ధర్మం పాటిస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? .. ఇకపై వైసీపీ నుంచి ఎవరు ఏ పార్టీలో చేరాలన్నా మూడు పార్టీలు సమిష్టి నిర్ణయం తీసుకుంటాయా?


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమి కట్టి వైసీపీని చిత్తుగా ఓడించాయి. ఎన్టీఏ కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో మూడు పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఊహించని పరాజయాన్ని ఎదుర్కున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డారు. అధికారంలో ఉన్న అయిదేళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు కేసుల భయంతో మిత్రపక్షాల తలుపులు తడుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వారి పూర్వాపరాలు, వారిపై ఉన్న ఆరోపణలు చెక్ చేయకుండానే పార్టీల్లో చేర్చుకుంటున్నారు.

2019 నుంచి 2024 వరకు అవినీతి, అరాచకాలు, అడ్డగోలు వ్యాపారాలకు పాల్పడి అపర కుబేరులుగా మారిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసుల భయంతో వణికిపోతున్నారు. అందుకే తమకు పొలిటికల్ షెల్టర్ కోసం కూటమి పార్టీల్లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. సదరు నేతలపై ఉన్న ఆరోపణల నేపధ్యంలో విచారణలు జరిపిస్తే ఇరుక్కుంటారని తెలిసి కూడా కూటమి పార్టీలు వారిని చేర్చుకుంటుండటం కేడర్‌కు, పక్క పార్టీల నేతలకు మింగుడు పడటం లేదంట.


ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో మంత్రులకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. అలాంటి ఒక మీటింగ్లో ఈ చేరికలకు సంబంధించి మంత్రుల మధ్య చర్చ జరిగిందంట. ఆ సందర్భంగా మొన్నీమధ్య బీజేపీలో చేరిన వైసీపీ నేత అడారి ఆనంద్ ప్రస్తావన వచ్చిందంట. విశాఖ డెయిరీ చైర్మన్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీకి దూరంగా ఉన్న ఆడారి ఆనంద్.. తనతో పాటు విశాఖ డైరీలో ఉన్న 12 మంది డైరెక్టర్లతో ఆ పార్టీకి రాజీనామా చేయించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డెయిరీలో జరుగుతున్న అవకతవకలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. విశాఖ డైరీ లోని తమ ప్రాధాన్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికే ఆడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకున్నారంట. విశాఖ డెయిరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల్లో ఖర్చు చేశారని అడారి ఆనంద్‌పై ఆరోపణలు వచ్చాయి. . దానికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తర్వాత కార్పొరేట్ సంస్థగా మార్చేశారన్న అభియోగాలున్నాయి.

రైతుల కోసం ప్రభుత్వం డెయిరీకి కేటాయించిన భూములను కూడా.. ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకుంటున్నారంటున్నారు. అందుకు సంబంధించిన ఫిర్యాదులను, అసెంబ్లీ సాక్షిగా విశాఖ నగర ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బయటపెట్టారు. దాంతో విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయడానికి.. ఆరుగురు ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. ఆ హౌస్ కమిటీ విచారణ కొనసాగుతుండటంతో భయంతోనే ఆడారి ఆనంద్ గబుక్కున్న పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పేసు కున్నారంట.

అడారి ఆనంద్ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆనంద్ జాయినింగ్ వ్యవహారం కూటమి నేతల మధ్య చర్చకు రాగా.. ఉత్తరాంధ్ర టీడీపీ నుంచి సానుకూలమైన స్పందన రాలేదంట.. దాంతో జనసేనలో ఆడారి చేరికకు డోర్లు క్లోజ్ అయ్యాయంట. ఒక వైపు విశాఖ డైరీ ఛైర్మన్ పదవి చేయి జారిపోతుందన్న బెంగ, మరోవైపు కేసుల భయంతో అల్లాడుతున్న అడారిని టీడీపీ, జనసేనలు వద్దనుకున్నప్పటికీ బీజేపీ అక్కన చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: జగ్గయ్యపేటలో వైసీపీకి.. పెద్ద దిక్కు లేకుండా పోవడానికి కారణాలేంటి?

ఇప్పుడు హౌస్ కమిటీ నివేదికలో అడారి ఆనంద్ అవినీతికి పాల్పడనట్లు తేలితే ఆయనపై చర్యలు తప్పవు. అప్పుడు ఆ అప్రతిష్ట మిత్రపక్షాలకే చుట్టుకుంటుంది. ఇక జనసేనలో చేరిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. రోశయ్య మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఎన్నికల ప్రచారంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు గుప్పించారు. మరి అటు వంటి ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకున్నారని పొన్నూరు టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మంగళగిరికి చెందిన గంజి చిరంజీవిని జనసేనలో చూర్చుకోవడం కూడా అక్కడి తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడటం లేదంట.

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడం అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వర్గానికి సుతారమూ ఇష్టం లేదంట. అయినా ఆ లాంఛనం పూర్తైపోయింది. ఏలూరుకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. గత మూడు దశాబ్దాలుగా ఏలూరులో ఆయన టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా వ్యవహించారు. అలాంటాయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఏలూర తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఆళ్ల నానికి పసుపు కండువా కప్పితే తాము టీడీపీ జెండా వదిలేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి మిత్రపక్షాల మధ్య సమన్వయ కమిటీ ఉంది. జాయినింగ్స్ విషయంలో ఆ కమిటీ చర్చించి సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ కమిటీతో పనిలేకుండానే పార్టీల పెద్దలు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటారని కూటమీ శ్రేణులు వాపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్నుందు పార్టీల నేతల మధ్య విభేదాలు మరింత ముదిరి అసలు బంధానికే ఎసరు వచ్చే పరిస్థితి తలెత్తుందని ఆందోళన చెందుతున్నాయి

దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏవైనా సమస్యలుంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే అందరూ తనతో సమన్వయం చేసుకోవాలని.. కూటమి నేతలను లోకేష్ కోరినట్లు తెలుస్తోంది. అంతే కానీ.. విడాకులు లాంటివి మాత్రం ఉండవని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి ఇక నుంచిైనా చేరికలపై కూటమి నేతల మధ్య సమన్వయం ఉంటుందో? లేదో? చూడాలి.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×