ECB on ENG vs AFG: 8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 తిరిగి ప్రారంభం కాబోతోంది. వచ్చే నెల నుండి ఛాంపియన్స్ ట్రోఫీ సందడి మొదలు కానుంది. పాకిస్తాన్, యూఏఈ వేదికగా ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు 8 జట్ల మధ్య ఈ పోరు జరగబోతోంది. అయితే మరికొద్ది రోజులలో ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ టోర్నీలో భాగంగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరగనున్న మ్యాచ్ ని ఇంగ్లాండ్ జట్టు బహిష్కరించనుందని సమాచారం.
Also Read: Shubman Gill – Ridhima Pandit: ఆ హీరోయిన్ తో గిల్ పెళ్లి.. ఇంతకీ ఎవరు ఈ రిద్దిమా?
2021లో తాలిబన్ నేతలు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆ దేశంలో మహిళలపై అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వాళ్ళు చెప్పిందే వేదం. చేసిందే చట్టం. వారి పాలనలో మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు. మహిళలను కేవలం వంటింటికే పరిమితం చేసేశారు. బయటకు వస్తే కచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. అంతేకాదు భర్త లేదా అన్న ఎవరైనా తోడుగా ఉంటేనే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.
ఇక అక్కడ స్కూల్లలో చదివే విద్యార్థినులు ఆరవ గ్రేడ్ మించి చదవకూడదు, ఆడవాళ్లు ఉద్యోగాలు చేయకూడదు, జిమ్ లేదా పబ్లిక్ పార్కుల్లో మహిళలు కనిపించడం నిషేధం. మహిళల నోట క్రికెట్ అనే మాట వినపడకూడదు. మహిళలు పాల్గొనే అన్ని క్రీడలను అక్కడ నిషేధించారు. మహిళా క్రికెట్ ని కూడా తాలిబన్ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ ఆంక్షలను బ్రిటిష్ రాజకీయ నేతలు ఖండిస్తున్నారు.
స్త్రీలకు విలువ లేని తాలిబన్ దేశానికి చెందిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడకూడదని యూకే రాజకీయ నేతలు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ని కోరారు. ఏకంగా 160 మంది యూకే రాజకీయ నాయకులు సంతకం చేసిన లేఖను ఈసీబీకి అందజేశారు. ఆఫ్ఘనిస్తాన్ తో తమ ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ని బహిష్కరించాలని, ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సీఈఓ రిచర్డ్ గౌల్డ్ ఈ అంశంపై స్పందిస్తూ.. మహిళల హక్కుల పట్ల తాలిబన్ ప్రవర్తనను ఖండిస్తున్నామని తెలిపారు. ఐసీసీ నియమావళి ప్రకారం మహిళా క్రికెట్ ని ప్రోత్సహించడం సభ్య దేశాల బాధ్యత అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీన లాహోర్ వేదికగా ఆఫ్గనిస్తాన్ – ఇంగ్లాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?
ఈ మ్యాచ్ బహిష్కరించాలని ఇంగ్లాండ్ రాజకీయవేత్తలు తీర్మానించారు. అయితే ఇంగ్లాండ్ పొలిటీషియన్లు ఈసీబీకి రాసిన లేక పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. గతంలో కూడా ఓసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ లో రాబర్ట్ ముగాబే పాలనకు నిరసనగా జింబాబ్వే తో జరగబోయే మ్యాచ్ ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బహిష్కరించింది.
England are scheduled to face Afghanistan on February 26 in the 2025 Champions Trophy but more than 160 politicians have written a letter to the ECB, urging to boycott the match.#ChampionsTrophy2025 #AfghanistanCricket #ENGvsAFG #ECB #CricketTwitter pic.twitter.com/acK3a3ZEEt
— InsideSport (@InsideSportIND) January 7, 2025