BigTV English

Trisha: లక్కీ స్టార్ ఆఫ్ కేరళతో నటించడం గర్వంగా అనిపిస్తుంది.. వారిని ప్రశంసలతో ముంచేసిన త్రిష

Trisha: లక్కీ స్టార్ ఆఫ్ కేరళతో నటించడం గర్వంగా అనిపిస్తుంది.. వారిని ప్రశంసలతో ముంచేసిన త్రిష

Trisha: హీరోలతో పోలిస్తే హీరోయిన్స్‌కు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు క్రేజ్‌లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేయాలి లేదా రెమ్యునరేషన్‌ను ఒక రేంజ్‌లో డిమాండ్ చేయాలి లాంటివి అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులకు అయితే ఎప్పటినుండో ఈ ఫీలింగ్ బలంగా ఉండిపోయింది. కానీ వారి మూఢనమ్మకాలను బ్రేక్ చేసి హీరోయిన్స్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా వెలిగిపోతున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అందులో ఒకరు త్రిష. హీరోయిన్‌గా తన కెరీర్ స్లోగానే స్టార్ట్ అయినా మెల్లగా తెలుగు, తమిళంలోని స్టార్లతో యాక్ట్ చేసి తాను కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తాజాగా మాలీవుడ్‌ను పొగిడేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.


త్రిష పొగడ్తలు

తెలుగు, తమిళంలో గుర్తింపు సాధించుకున్న త్రిష.. అప్పుడప్పుడు హిందీ, మలయాళ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. మలయాళంలో తనకు ఆశించినంత ఆదరణ లభించకపోయినా ఇప్పటికీ మాలీవుడ్ మేకర్స్ తనకు పిలిచి ఆఫర్లు ఇస్తున్నారు. అలా తాజాగా టోవినో థామస్ హీరోగా నటించిన ‘ఐడెంటిటీ’ (Identity)లో హీరోయిన్‌గా నటంచింది త్రిష. వినయ్ మరొక కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 2న విడుదలయిన ఈ సినిమా కేవలం కేరళలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయగా అందులో త్రిష కూడా పాల్గొని మాలీవుడ్ గురించి ఓ రేంజ్‌లో పొగిడేసింది.


Also Read: ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.! ఇప్పటికీ రిచ్చే.!

లక్కీ స్టార్

‘‘నేను ఇంతకు ముందు చాలా ప్రెస్ మీట్స్‌లో పాల్గొన్నాను. కానీ ఒక మలయాళ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ప్రత్యేకంగా, చాలా తెలివిగా కథలు చెప్తారు కాబట్టి మలయాళం సినిమాను నేనెప్పుడూ గొప్పగానే చూశాను. నేనెప్పుడూ కనీసం ఏడాదికి ఒక మలయాళ సినిమాలో అయినా నటించాలని అనుకునేదాన్ని. దర్శకుడు అఖిల్‌ను సరైన సమయంలో కలవడం వల్ల ఇది జరిగింది. తను కథ చెప్పిన విధానం చాలా బాగుంది. టోవినో థామస్ నిజంగా లక్కీ స్టార్ ఆఫ్ కేరళ. ఎండ్రేండ్రుమ్ పున్నగయ్ సినిమా అప్పటి నుండి వినయ్ నాకు ఫ్రెండ్’’ అంటూ ‘ఐడెంటిటీ’ మూవీ టీమ్ అందరినీ పొగిడేసింది త్రిష (Trisha).

చాలా గర్వపడుతున్నాను

‘‘ఐడెంటిటీ అనేది నేను ఇంతకు ముందుకు చేసిన రొమాంటిక్ ఫ్రెండ్‌షిప్ కథలకు పూర్తిగా భిన్నం. షూటింగ్ అంతా చాలా సరదాగా, పాజిటివ్‌గా సాగిపోయింది. అదే ఔట్‌పుట్‌లో కూడా కనిపించింది. సినిమా సక్సెస్ అనేది ఎవరూ ముందుగా ఊహించలేరు. కానీ మొదటిరోజు నుండి ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రివ్యూలు, ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. తమిళనాడులో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం, థియేటర్లు పెరగడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక సినిమాలో నటించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. న్యూ ఇయర్‌ను ఇలా ప్రారంభించినందుకు థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది త్రిష.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×