మొన్నటి దాకా బండి భగీరథ్ ఇష్యూలో నానాయాగీ చేసిన బీఆరెస్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నది. భగీరథ్ లొంగిపొవడం.. తానే అప్పగించానని, చట్టం, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకముందని బండి సంజయ్ ప్రకటించడంతో.. మళ్లీ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది కేటీఆర్ అండ్ టీమ్. పోలీసులు పట్టుకున్నామంటున్నారు.. బండి అప్పగించామంటున్నారు..? అసలేం జరిగిందో చెప్పండి! అని డిమాండ్ చేశారరు. ఇది పెద్దగా వర్కవుట్ అయినట్టు అనిపించలేదు. ఈ కథ కాస్త చల్లారేలా ఉంది.. ఇంత చేసీ అప్పుడే దీన్ని చల్లబరిస్తే ఎలా? అనుకుని.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
కవిత కూడా ఇది వరకే మోడీకి ఈ విషయంలో లేఖ కూడా రాసి ఉన్నారు. అయితే ఢిల్లీ పెద్దల నుంచి బండి సంజయ్ కొడుకు కేసు వ్యవహారంలో ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చి ఉన్నారు. కొడుకు ఇష్యూతో బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును ముడిపెట్టి చూడబోమని భుజం తట్టినట్టు తెలిసింది. దీంతో మొన్నటిదాకా మిన్నకుండిన ఇక్కడి రాష్ట్ర నాయకత్వం కూడా వాయిప్ పెంచింది. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాం చంద్రారావు ఇవాళ.. ఈ విషయంలో బీఆరెస్‌కు మూతోడ్ జవాబిచ్చారు. బీఆరెస్ చేసిన లోపాలు, పాపాలను ఎత్తి చూపుతూనే వారెందుకు రాజీనామాలు చేయలేదని నిలదీయడంతో ఆ పార్టీని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసినట్టయ్యింది. కాళేశ్వరంపై మీరెందుకు కోర్టుకెళ్లారు.. అని ప్రశ్నించడం ద్వారా ఈ నేరం చేయకపోతే, అవినీతి జరగకపోతే మీరు కోర్టుకెందుకు వెళ్లారు? అని పాత విషయాలను తవ్వి తీశారు స్టేట్ ప్రెసిడెంట్.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకు పోతే.. కేసీఆఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని ఎదురు ప్రశ్నించడంతో బీఆరెస్ డైలామాలో పడిపోయింది. ఇక ఇంతటితో దీన్ని వదిలేయకపోతే.. రోజు రోజుకు బీజేపీ నుంచి వాయిస్ పెరగడంతో పాటు ఎదురుదాడి జరిగి గతం తాలూకు లోతులు తవ్వే పని జరుగుతుందనే డిఫెన్స్ లో పడిపోయింది ఇప్పుడు బీజేపీ. పార్టీ తరపున ..బండి సంజయ్ ఏ తప్పూ చేయలేదని క్లీన్ చీట్ ఇవ్వడమే .. ఇకపై బండిపై ఎలాంటి పార్టీ పరమైన , పదవి పరమైన చర్యలు ఉండబోవనే విషయాన్ని పరోక్షంగా స్పష్టతనిచ్చినట్టయ్యింది. కోట్లు ఖర్చు పెట్టి అబద్దపు ప్రచారాలు చేయించారని కూడా అన్నారు రాంచంద్రరావు. అంటే.. కేటీఆర్ ఈ విషయంలో తన సోషల్ మీడియను ఉసిగొల్పి తప్పుడు ప్రచారాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని, బీజేపీని బద్నాం చేసేందుకు సర్వశక్తలు ఒడ్డాడని దుయ్యబట్టారు.
బండిని బర్తరఫ్ చేయాలనే బీఆరెస్ తాజా డిమాండ్‌తో.. బీజేపీ అధిష్టానం నుంచి ఆయన పూర్తి సపోర్టు ఉందనే విషయాన్ని చెబుతూ.. బండి సంజయ్ ఏ తప్పూ చేయలేదని, అది అతని కుటుంబ వ్యవహారమని, అందులో తప్పు, శిక్షా చట్టం చూసకుంటుందని పునరుద్ఘాటించారు. దీనికి అదనంగా బీఆరెస్ పదేళ్ల పాలన లోపాలను, పాపాలను ఆయన ఎత్తిచూపడంతో ఇక ఈ కథకు కేటీఆర్ పుల్ స్టాప్ పెట్టకపోతే బీజేపీ నుంచి మరింతగా దాడి ముమ్మరం అవుతుందనే సంకేతమిచ్చింది అధిష్టానం.