Cyber Crime: స్వేచ్ఛ బ్యూరో: సైబర్ క్రిమినల్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్సీఆర్పీ ద్వారా గత నెలలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 77 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0పేర స్పెషల్ ఆపరేషన్లు జరిపి 32 మంది బ్యాంక్ మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లతోపాటు 15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లను, 9 మంది అకౌంట్ ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులకు మొత్తం 101 కేసులతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడయ్యింది. ఇక, గత నెలలో 69,99 లక్షల రూపాయలను బాధితులకు రీఫండ్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో 17మంది ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 30మంది ట్రేడింగ్, ఇద్దరు సోషల్ మీడియా ఫ్రాడ్లలో నిందితులుగా ఉండగా డిజిటల్ అరెస్ట్ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక, మ్యాట్రిమోనియల్, క్రెడిట్ కార్డ్, డేటింగ్, లక్కీ డ్రా మోసాలలో నలుగురిని,చ ఫెడెక్స్ మోసంలో ఇద్దరిని కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఆపరేషన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహర్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కొనసాగింది. నిందితుల నుండి 34 మొబైల్ ఫోన్లు, 8 చెక్ బుక్కులు, 11 షెల్ కంపెనీ స్టాంపులు, ఓ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..? ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్
గత నెలలో సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ బాధితులు 9.13కోట్ల రూపాయలు పోగొట్టుకోగా దీంట్లో 69.99 లక్షల నగదును సైబర్ క్రైం పోలీసులు రికవరీ చేశారు. ఆ మొత్తాన్ని బాధితులకు రీఫండ్ చేశారు. గేమింగ్ ఫ్రాడ్ కేసులో ఓ బాధితురాలి నుంచి 74.99లక్షలు కొల్లగొట్టిన కేసులో కోల్ కతాలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ అకౌంట్స్ మేనేజర్ మహ్మద్ రియాజుద్దీన్, అసిస్టెంట్ మనీష్ ప్రసాద్ లను అరెస్ట్ చేశారు. సైబర్ పెట్రోలింగ్ ను పకడ్భంధీగా జుపుతూ నకిలీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న 184 సోషల్ మీడియా ప్రొఫైళ్లను గుర్తించి వాటిని తొలగించారు. సీ మిత్ర ద్వారా 194 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి 1250మంది బాధితులతో ఫోన్ లో మాట్లాడి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించారు.
Also Read: హర్మూజ్ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్ ఫ్రీడమ్ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!