E-Paper
Advertisement

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. బల్మూరి వెంకట్ సంచలనం!

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. బల్మూరి వెంకట్ సంచలనం!
Advertisement

Balmoor Venkat: సిఎల్పీ మీడియా హాల్‌ వేదికగా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారని, ఈ విషయంపై అసెంబ్లీలోనే సీఎం పూర్తి స్పష్టత ఇచ్చారని తెలిపారు. అయినా బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు.

ప్రైవేట్ జెట్ ప్రయాణాలు..

Advertisement

కేటీఆర్ గతంలో ప్రైవేట్ జెట్లలో ప్రయాణించేందుకు తన పేరును K రామ్, రామ్ KT అని, అలాగే రాజకీయ ప్రయోజనాల కోసమే అజయ్ అనే పేరును K తారకరామారావు గా మార్చుకున్న చరిత్ర ఉందన్నారు. మంత్రి హోదాలో ఉంటూ ప్రభుత్వ సొమ్ముతో దుబాయ్, ఢిల్లీ, ముంబై మీదుగా ప్రైవేట్ జెట్లలో తిరిగిన వైనంపై ఆధారాలు ఉన్నాయని బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయాల్లో కేటీఆర్‌తో కలిసి ప్రయాణించిన సినీ ప్రముఖులు, హీరోయిన్లు ఎవరనేది తేదీలు, సమయాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. కేటీఆర్ భయంతోనే పలువురు సినీ ప్రముఖులు ముంబైలో సెటిల్ కాక తప్పలేదని వ్యాఖ్యానించారు.

ఎల్ నినో కంటే తీవ్రమైన నష్టం

Advertisement

రాష్ట్రంలో నీటి కష్టాలకు బిఆర్ఎస్ పాలనా లోపాలే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. ఎల్ నినో ఎంతటి నష్టం చేసిందో బిఆర్ఎస్ కూడా అంతే నష్టాన్ని మిగిల్చిందన్నారు. కాళేశ్వరం నీటిని సక్రమంగా ఎత్తిపోయకపోతే ఆ నీళ్లు దేవాదులకు వెళ్తాయా లేక ఏపీకి పోతాయా అనే విషయం 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే మీ నాన్న కేసీఆర్‌నే అడగాలని ఎద్దేవా చేశారు. చివరగా, తాను చేస్తున్న ఆరోపణలు అసత్యాలని అనిపిస్తే, కేటీఆర్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన కొడుకుపై ఒట్టు వేసి నిజాలు చెప్పాలని వెంకట్ సవాల్ విసిరారు.

Also Read: లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

Tags

Related News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

బొగ్గు కాదు.. ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్!

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

Big Stories

Advertisement
×