E-Paper
Advertisement

Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ ‘మౌన వ్రతం’ వెనుక మాస్టర్ ప్లాన్.. ఆ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్?

Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ ‘మౌన వ్రతం’ వెనుక మాస్టర్ ప్లాన్.. ఆ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్?
Advertisement

Avanthi Srinivas: ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు… భీమిలీలో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు… వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. జనసేన లోకి వెళ్లేందుకు ప్రయత్నించారన్న టాక్ నడిచింది. చివరికి బీజేపీలోకి టచ్లోకి వెళ్లారన్న ఊహాగానాలు వినిపించాయి.. అయితే అవంతి మాత్రం తన పొలిటికల్ ఫ్యూచర్‌పై రెండేళ్లుగా నోరు విప్పలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ అలా సైలెంట్ గా ఉండడం వెనక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా?

అవంతి శ్రీనివాస్ రాజకీయ గాధ

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది… 2024 ఎన్నికల వరకు ఓటమి తెలియని నాయకుడిగా, 2009 నుంచి 15 ఏళ్లు పార్టీలు మారిన పదవిని మాత్రం కోల్పోకుండా వచ్చారు అవంతి శ్రీనివాస్ …. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పిఆర్పి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా, 2019 ఎన్నికల్లో రెండోసారి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు… 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి చెందడంతో వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

రాజకీయ విరామంలో అవంతి

Advertisement

అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరం కావడంతో ఎక్కడా అవంతి గురించి చర్చ గాని , రాజకీయ విమర్శలు గాని, అవినీతి ఆరోపణలు గాని వినిపించడం లేదు … బహుశా వైసీపీలో కొనసాగి ఉంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవంతిపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చి ఉండేవేమో.. వైసీపీకి రాజీనామా చేసిన రోజు నుంచి రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ కొద్దిరోజుల తర్వాత బీజేపీలో జాయిన్ అవుతారు, టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగింది. ఈరోజుకి ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది…..రోజులు గడుస్తూ వస్తున్నాయి కానీ అవంతి శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలోనూ జాయిన్ కాకుండా తన వ్యాపారాలను చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నారు..

మళ్లీ రాజకీయాల్లోకి అవంతి?

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా రెండేళ్లు పూర్తవుతోంది… మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ మళ్ళీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో టీడీపీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం భీమిలి నియోజకవర్గంతో పాటు విశాఖలో చెక్కర్లు కొడుతోంది…

రాజకీయ రీఎంట్రీకి సంకేతాలా?

Advertisement

గడిచిన రెండేళ్లలో రాజకీయంగా ఫోకస్ అవ్వని అవంతి శ్రీనివాస్ బయట జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేయడానికి, మళ్లీ రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు కనిపిస్తుంది… ఎన్నికల తర్వాత వైసిపికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న అవంతి శ్రీనివాస్ అతని కొడుకు వివాహానికి మాత్రమే కొంత హడావుడిగా కనిపించారు… ఆ సందడి అంతా పూర్తయిన తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు… అయితే ఇప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ 40వ వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న అవంతి శ్రీనివాస్, అటు గంటాతో పాటు ఇటు బీజేపీ, టీడీపీ నాయకులతో అత్యంత సన్నిహితంగా మెలగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది…

కూటమిలో అవంతి ఎంట్రీకి క్లారిటీ

ముఖ్యంగా కూటమి పార్టీల్లో అవంతి శ్రీనివాస జాయిన్ అవుతారని ఎప్పటినుండో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు.. కూటమి పార్టీలు కలిసి పోటీ చేసినంత కాలం భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ కు సీటు వచ్చే అవకాశం కచ్చితంగా ఉండదు. ఎందుకంటే ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు రవితేజను రంగంలోకి దించాలని రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు… ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ చేసే అవకాశం లేదు.

అవంతి సైలెన్స్ బ్రేక్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భీమిలి నియోజకవర్గం రెండుగా ఏర్పడితే కచ్చితంగా తనకి ఓ సీటు వస్తుందని భావిస్తున్న అవంతి శ్రీనివాస్ పొలిటికల్ సైలెన్స్ బ్రేక్ చేస్తున్నారంట. రానున్న ఎన్నికల్లో సీటు మాట ఎలా ఉన్నా, ప్రస్తుతం కూటమి పార్టీలో స్థానం సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్న అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న గంట శ్రీనివాస్‌తో పాటు బిజెపి, జనసేన పార్టీ నాయకులకు సైతం దగ్గరవుతూ రీఎంట్రీకి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాజకీయంగా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నా.. ప్రస్తుతం కూటమి కలిసి ఉన్నంతవరకు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అవంతి ఫిక్స్ అయ్యారంట. అందుకే విమర్శలను, అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి గంటా శ్రీనివాసరావుతో కలవడమే కాక కూటమి నాయకులకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది

టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న అవంతి

ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ కూటమి పార్టీల్లోని ఏ రాజకీయ పార్టీ తీర్థం తీసుకుంటారు అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. సామాజిక వర్గం పరంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగినా, టీడీపీ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన అనుభవం ఉండడంతో, జనసేన పార్టీలో సీట్ల సర్దుబాటుకు అవకాశం చాలా తక్కువ కాబట్టి, టిడిపి కండువా కప్పుకుని బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమని అవంతి శ్రీనివాస్ లెక్కలు వేసుకుంటున్నారంట.. మరొక 15 ఏళ్ళు మూడు పార్టీలుకలిసి పోటీ చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్న నేపథ్యంలో కూటమితో కలిసి ఉంటేనే రాజకీయంగా, వ్యాపార పరంగా సేఫ్ అని అవంతి శ్రీనివాస్ భావిస్తున్నారంట.

2029 కోసం ఇప్పటినుంచే వ్యూహం

వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే కూటమి గూటికి చేరాలని ప్రయత్నం చేసిన కూటమి నుండి అవకాశం దొరకపోవడంతో సైలెంట్‌గా ఉండిపోయారాయన. అయితే విశాఖ కార్పొరేషన్ మేయర్ మార్పులో తన కూతురు ఓటు రూపంలో అవకాశం రావడంతో, టీడీపీ కూటమికి ఓటు వేసి తన చూపు కూటమి వైపే ఉంది అని సంకేతాలు ఇచ్చారు… అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా, 2029 ఎన్నికలకు ముందు నుంచే రంగం సిద్ధం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న అవంతి ఎక్కడ నుంచి బరిలోకి దిగితే సేఫ్ గా ఉంటుందో అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అవంతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితులా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గ నుంచి బరిలో దిగాలన్నా ఆర్థికంగా స్థితి మంతుడై ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నెలకొంది… అవంతి శ్రీనివాస్ ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో, కూటమి పార్టీలు కూడా తమ పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా సీటు ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి… ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై నిత్యం సర్వేల రిపోర్ట్స్ బయట పెడుతున్న సీఎం చంద్రబాబు, పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో సీటు ఉండదని స్పష్టం చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే అవంతి శ్రీనివాస్ టీడీపీలో జాయిన్ అయితే, కచ్చితంగా తనకి సీట్ రావడమే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామిః అవుతాను అనే ఆలోచన ఉండడంతో ఆయన టీడీపీకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారంట.

విశాఖ-అనకాపల్లి నుంచి కొత్త ప్లాన్

అ క్రమంలో అవంతి తన ఫ్యూచర్ కు అనుగుణంగా ఉండే ప్లానింగ్స్ ను చేసుకున్నట్లు కనిపిస్తుంది… ఇప్పటికే అవంతి శ్రీనివాస్ అనకాపల్లి, విశాఖ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందనేన్న ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో విశాఖ ఎంపీ భరత్ భీమిలి నియోజకవర్గం నుండి బరిలో దిగుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దాంతో ఆఅవంతి కూటమి సారథ్యంలో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు. విశాఖ ఎంపీ భరత్ భీమిలి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తే ఏ నియోజకవర్గ నుంచైనా గెలుస్తారు అనే పేరు ఉన్న గంట శ్రీనివాస్ లో పక్క నియోజకవర్గానికి పంపే అవకాశం ఉండడంతో అవంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

రెండు లోక్‌సభలపై అవంతి ఫోకస్

ఎంపీగా విశాఖతో పాటు అనకాపల్లి నియోజకవర్గ నుండి కూడా ఎక్కువ ఛాన్సెస్ అవంతికి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు… ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నుండి బరిలోకి దిగకపోతే, గతంలో టీడీపీ ఎంపీగా అనకాపల్లి నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్‌ని టీడీపీ బరిలోకిదించుతుంన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ ఇప్పటినుండే అటు విశాఖ ఇటు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది..

అవంతి కొత్త రాజకీయ లెక్కలు

టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి వస్తుందో రాదో అనే సందేహాలు ఉన్న నేపథ్యంలో, ఎంపీగా బరిలోకి నిలిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది అవంతి ఆలోచనగా చెప్తున్నారు… దానికి తోడు గతంలో ఎంపీగా పనిచేసిన నేపథ్యంలో, అన్ని పార్టీల నాయకులతో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న అవంతి ఎంపీగా అయినా ముందడుగు వేయడానికి లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కొత్త ప్రచారం ఉపందుకుంటోంది…

అవంతి కొత్త రాజకీయ గేమ్ ప్లాన్

ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. అక్కడ నుంచి పోటీ చేస్తే జనసేన ఎలాగూ మద్దతిస్తుంది కాబట్టి, అవంతి తన రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతుంది…వైసీపీ చోడవరం నియోజకవర్గానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని ఇన్చార్జిగా నియమించడంతో అవంతి శ్రీనివాస్ కూడా టిడిపి తనకు అవకాశం ఇస్తే చోడవరం నుండి బరిలో దిగడానికి రెడీ అని సిగ్నల్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది… అందుక ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న అవంతి శ్రీనివాస్ వర్గం యాక్టివేట్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది… మరి చివరికి అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారో? ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి.

Also Read: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సూపర్ ఎల్ నినో.. సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందేనా?

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×