E-Paper
Advertisement

Noida Airport: అందులోబాటులోకి ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్, అమ్మో.. ఎన్ని సౌకర్యాలో!

Noida Airport: అందులోబాటులోకి ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్, అమ్మో.. ఎన్ని సౌకర్యాలో!
Advertisement

Noida International Airport: ఉత్తరప్రదేశ్‌ లోని జేవార్ ప్రాంతంలో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఇవాళ ప్రారంభం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ దేశ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం కానుంది. ఈ ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నోయిడా విమానాశ్రయం గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఏడాదికి 22 లక్షల మంది ప్రయాణం   

ఈ విమానాశ్రయం మొదటి దశలో ఒక టెర్మినల్, ఒక రన్‌వేతో ఆపరేషన్స్ ను ప్రారంభిస్తుంది. ప్రారంభ దశలో సంవత్సరానికి సుమారు 22 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి కొట్లాది మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా ప్లాన్ చేశారు. ఇది ఉత్తర భారతదేశంలో విమాన రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

⦿ పశ్చిమ యూపీకి గేట్ వేగా..

Advertisement

జేవార్ విమానాశ్రయం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు ప్రధాన ప్రవేశ ద్వారంగా మారనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల వ్యాపార కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ఎయిర్ పోర్టు కీలకంగా మారనుంది.

⦿ ప్రముఖ ఎయిర్‌లైన్స్ సిద్ధం

ప్రారంభోత్సవం తర్వాత కొద్ది రోజులకే ఇండిగో, ఆకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రె లాంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొదట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది.

⦿ కార్గో, లాజిస్టిక్స్ హబ్ గా..

Advertisement

ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణీకులకే కాకుండా కార్గో రవాణా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌ హాల్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకాసా ఎయిర్ ఈ ఎయిర్ పోర్టుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా దీన్ని ఒక ప్రధాన ఏవియేషన్ హబ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా లాభం చేకూరనుంది.

⦿ స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం  

జేవార్ విమానాశ్రయం ప్రారంభంతో యమునా ఎక్స్‌ ప్రెస్‌ వే పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, గోడౌన్స్, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అయితే, భూములు కోల్పోయిన స్థానిక ప్రజలు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న విషయం కూడా గమనించాల్సిన అంశం. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేస్తోంది.

మొత్తంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశ విమానయాన రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీ, వ్యాపారం, ఉపాధి అవకాశాల పరంగా ఎంతో ఉపయోగపడనుంది. అయితే, విమానాశ్రయ అభివృద్ధిలో స్థానిక ప్రజల సంక్షేమం కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

Read Also:  రైళ్ల తరహాలోనే విమానాల్లో పడుకొని ప్రయాణించవచ్చు.. ప్రయాణికులకు పండగే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×