E-Paper
Advertisement

Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
Advertisement

Gudivada Amarnath: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తులు ఎన్నుకున్న ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు.

గతంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించేవారని, కానీ ఇప్పుడు పీపీపీ (PPP) పద్ధతి పేరుతో ఆ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. పీపీపీ ముసుగులో సినిమా హాళ్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేయడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని, రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేట్ పరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.

Advertisement

రుషికొండ భవనాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని, నేడు ఆ భవనాలు రాష్ట్రానికే ఐకానిక్‌గా నిలిచాయని అమర్నాథ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎవరూ కట్టని విధంగా భవనాలు నిర్మిస్తే వైఎస్ జగన్‌ను విధ్వంసకారుడు అంటారని, అదే అమరావతిలో నీరు తోడటానికి రూ. 450 కోట్లు ఖర్చు చేసే చంద్రబాబు మాత్రం విజనరీనా అని సూటిగా ప్రశ్నించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పోటీతత్వం పెరగాలంటే ఎక్కువ టెండర్లు రావాలి కానీ, సింగిల్ టెండర్ వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. సచివాలయాలకు చంద్రబాబు ఏ పేరు పెట్టినా, ఆ వ్యవస్థ సృష్టికర్త వైఎస్ జగనే అని, పేర్లు మార్చినంత మాత్రాన జగన్ చేసిన మంచిని ప్రజలు మర్చిపోరని అమర్నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Read Also: Madhavi Latha: సాయిబాబా పై దుష్ప్రచారం.. మాధవీ లత పై కేసు నమోదు!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×