BIG TV Free Medical Camp: నిజం కావాలా.. భజన కావాలా అనే నినాదంతో మీడియారంగంలో ప్రవేశించిన బిగ్ టీవి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందింది. నిఖార్సైన వార్తను అద్భుతంగా అందించడంతో పాటు.. పేద ప్రజలకు అండగా నిలుస్తోంది బిగ్ టీవి.. పల్లెల్లో, పట్టణాల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ.. పేదలకు అండగా నిలుస్తోంది మన బిగ్ టీవి.
తాజాగా హైదరాబాద్ లోని తులసీనగర్ లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాంప్‌లో పలు విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలు అందించారు. జనరల్ మెడిసిన్, షుగర్, బీపీ, కంటి పరీక్షలు, డెంటల్ చెకప్, గైనకాలజీ, ఫిజియోథెరపీ వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. బిగ్ టీవీ సంస్థతో పాటు స్థానిక సీజన్ హాస్పిటల్ కూడా భాగస్వామ్యం అయ్యాయి.
స్థానికులకు ఉచితంగా మందులతో పాటు.. ఈసీజీ, బిఎమ్‌ఐ చెకప్ కూడా నిర్వహించారు. కొందరికి డాక్టర్ల సలహాలు, ఆహార నియమాలు గురించి వైద్యులు సూచనలు అందించారు.
ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ క్యాంప్‌లో.. వందలాది మంది స్థానికులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కాలనీ పరిసరాల ప్రజలు, మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ శిబిరాన్ని సందర్శించారు.
గణనీయమైన జనసాంద్రత గల ప్రాంతంలో ఇలాంటి సేవలు అందించడం ప్రజలకు ఎంతో మేలు చేసినట్లు అయింది. స్థానికులు మాట్లాడుతూ.. ఇంత పెద్ద స్థాయిలో ఉచిత క్యాంప్ ఇక్కడ జరగడం చాలా గొప్ప విషయం. ఇంటి దగ్గరే వైద్య పరీక్షలు చేయించుకోవడం సౌకర్యంగా అనిపించింది అని అన్నారు. బిగ్ టీవీలాంటి సంస్థలు ప్రజల ఆరోగ్యం పట్ల చైతన్యం చూపించడం అభినందనీయం అని వారు తెలిపారు.
Also Read: టెలివిజన్ చరిత్రలో బిగ్ టీవీ సంచలనం.. ఫ్రీ హెల్త్ క్యాంప్‌లలో డబుల్ సెంచరీ..
ఉచిత వైద్య శిబిరం ద్వారా బిగ్ టీవీ సంస్థ ప్రజల్లో సామాజిక బాధ్యత.. అనే భావనను మరింత బలంగా చాటింది. కేవలం మీడియా రంగానికే పరిమితం కాకుండా.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తోంది. అనితర సాధ్యమైన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలతో పాటు.. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసిస్తున్నారు.