TGCAB Staff Assistant Posts: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీజీ క్యాబ్) పరిధిలోని సహకార బ్యాంకుల్లో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యంతో పాటు ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం ఉండాలి. తెలంగాణ స్థానికత కలిగిన వారు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవరంబర్ 6 వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
అక్టోబర్ 01, 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050 నుంచి రూ.64,480, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read: SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే
జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు- రూ.750
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు- రూ.250.