BigTV English

Red Magic 11 Pro: 24GB ర్యామ్, 8000 mAh బ్యాటరీ.. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో అదిరిపోయే గేమింగ్ ఫోన్

Red Magic 11 Pro: 24GB ర్యామ్, 8000 mAh బ్యాటరీ.. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో అదిరిపోయే గేమింగ్ ఫోన్
Advertisement

Red Magic 11 Pro| నుబియా రెడ్ మ్యాజిక్ బ్రాండ్ కొత్త గేమింగ్ సిరీస్‌ ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్ మ్యాజిక్ 11 ప్రో పేరుతో విడుదలైన ఈ ఫోన్‌లు సీరియస్ మొబైల్ గేమర్ల కోసం రూపొందించబడ్డాయి. ఈ ఫోన్లు అసాధారణ పెర్ఫామెన్స్, ఎండ్యూరెన్స్ ఇస్తాయి. ఈ ఫోన్‌లో ప్రధానంగా.. రెవల్యూషనరీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది.


స్పెషల్ హైబ్రిడ్ కూలింగ్ సిస్టమ్

ఈ ఫోన్‌లో డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఎయిర్, లిక్విడ్ కూలింగ్‌ను కలిపి విండ్ అండ్ వాటర్ సిస్టమ్ ఉంది. ఫోన్ టెంపరేచర్‌ను ఈ సిస్టమ్ చల్లగా ఉంచేందుకు టెంపరేచర్ కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఇందులోని యాక్టివ్ ఫ్యాన్ 24,000 rpm వేగంతో తిరుగుతుంది. దీర్ఘకాలిక గేమింగ్ సెషన్‌లలో ఓవర్‌హీటింగ్ రాకుండా చూస్తుంది. IPX8 రేటింగ్‌తో ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్. అంటే గేమర్లు ఏ టెన్షన్ లేకుండా ఎంత సేపైనా గేమ్స్ ఆడవచ్చు.

అసమానమైన ప్రాసెసింగ్ పవర్

ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఇది అత్యంత పవర్‌ఫుల్ మొబైల్ ప్రాసెసర్. 24GB వరకు RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. క్యూబ్ గేమ్ ఇంజిన్ 3.0 గేమ్‌ప్లేను మరింత మెరుగుపరుస్తుంది. భారీ గేమ్‌లు సులభంగా రన్ అవుతాయి. గేమింగ్‌లో ల్యాగ్ లేకుండా సూపర్ స్మూత్ పెర్ఫామెన్స్ ఇస్తుంది.


ఇమర్సివ్ డిస్‌ప్లే, డిజైన్

ఇందులో 6.85-ఇంచ్ సైజులో అద్భుతమైన 1.5K డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్‌ 144Hz అంటే స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 95.3%. స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ 2.0 మీ కళ్లపై ఒత్తిడి లేకుండా చేస్తుంది. వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్ కూడా ఉంది. దీని డిజైన్.. గేమర్లకు స్పెషల్‌గా ఉంది. ఫుల్ మెటల్ బాడీ, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

పెద్ద బ్యాటరీ, చార్జింగ్

ఫోన్‌లో బుల్ డెమన్ కింగ్ బ్యాటరీ 3.0. దీని కెపాసిటీ 8,000mAh అంటే పెద్ద బ్యాటరీ. . 120W వైర్డ్ చార్జింగ్, 80W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్. అంటే సూపర్ స్పీడ్ చార్జింగ్ తో నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ తో గంటల తరబడి గేమ్స్ ఆడవచ్చు. కొద్ది నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఎప్పుడూ ప్రయాణంలో ఉండేవారికి కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్

50MP ప్రైమరీ కెమెరా OIS సపోర్ట్‌తో స్థిరమైన షాట్స్ తీస్తుంది. 50MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో, 50MP ఫ్రంట్ కెమెరాలు కూడా ఉన్నాయి.. AI ఎరేజర్ టూల్ ఫొటోల నుంచి అనవసర వస్తువులను తొలగిస్తుంది. AI పవర్డ్ ఫీచర్లు ఉండడంతో వన్-క్లిక్ ఫోటో ఎడిటింగ్ సులభం. గేమింగ్ కాకుండా డైలీ యూజ్‌కు కూడా మంచిది.

ధర, వేరియంట్‌లు

రెడ్ మ్యాజిక్ 11 ప్రో ప్రారంభ ధర CNY 4,999 ( అంటే భారత కరెన్సీ సుమారు రూ. 62,000). ప్రో+ మోడల్ CNY 5,699 నుండి. టాప్ వేరియంట్ CNY 7,699. వివిధ RAM, స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. భారత్‌లో త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం టాప్ వేరియంట్ లో 16GB RAM అందుబాటులో ఉంది. త్వరలోనే 24GB RAM వెర్షన్ కూడా తీసుకువస్తామని నుబియా కంపెనీ ప్రకటిచింది.

అదనపు గేమింగ్ ఫీచర్లు

3.5mm హెడ్‌ఫోన్ జ్యాక్ ఉంది. డ్యూయల్ స్పీకర్ యూనిట్ ఇమర్సివ్ సౌండ్ ఇస్తుంది. మూడు మైక్రోఫోన్‌లు క్లియర్ కమ్యూనికేషన్ కు ఉపయోగపడతాయి. 360-డిగ్రీ యాంటెన్నా డిజైన్ కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది. లీనియర్ మోటార్ ప్రెసైజ్ హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. వై-ఫై 7, NFC, IR బ్లాస్టర్ కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్‌లు

ప్రో మోడల్ డార్క్ నైట్, లోర్డ్ వార్ గాడ్ కలర్‌లలో వస్తుంది. ప్రో+లో ట్రాన్స్‌పరెంట్ డిజైన్ వేరియంట్‌లు కూడా ఉన్నాయి. మీ స్టైల్‌కు సరిపోలే కలర్ వేరియంట్ ను ఎంచుకోండి.

గేమర్‌లకు అల్టిమేట్ డివైస్

రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ గేమింగ్ స్టాండర్డ్‌ను కొత్తగా సెట్ చేసింది. హైబ్రిడ్ కూలింగ్ పెద్ద ఇన్నోవేషన్. ఇందులోని రా పవర్ ఫ్లాలెస్ గేమ్‌ప్లే ఇస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడింది. మొబైల్ గేమింగ్ లిమిట్‌లను ఈ ఫోన్ రీడిఫైన్ చేస్తుంది.

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

Motorola new smartphone: 7000mAh భారీ బ్యాటరీ, 350MP కెమెరా.. మార్కెట్లో దుమ్మురేపుతున్న మోటో జీ75

M5 vs M4 MacBook Pro: M5 మ్యాక్ బుక్ ప్రో vs M4 మ్యాక్ బుక్ ప్రో.. ఆపిల్ రెండు ల్యాప్‌టాప్స్‌లో ఏది బెటర్?

Samsung Support End: గెలాక్సీ పాపులర్ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ నిలిపివేసిన శామ్‌సంగ్.. మీ ఫోన్ కూడా ఉందా?

Motorola Discount: మోటోరోలా 7000mAh బ్యాటరీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.7200కు లేటెస్ట్ మోడల్

Amazon Offers: 99 రూపాయలకే మొబైల్‌ ఫోన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అదిరే ఆఫర్

Samsung Galaxy Ultra Neo: 6000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. బడ్జెట్‌లో అల్ట్రా అనుభవంతో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్

VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

Big Stories

×