BIG TV Free Medical Camp : మీడియారంగంలో వ్యాపార ధోరణిలో సాగుతున్న వేళ పేదలకు బాసటగా నిలుస్తుంది బిగ్ టీవి. ప్రారంభించిన అతి తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్న బిగ్ టీవి.. పేదల అనారోగ్యంపై దృష్టి సారించింది. వారి కుటుంబాలకు అండగా ఉన్నామని చెప్పడమే కాకుండా.. ప్రతి జిల్లాలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ.. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడంతో పాటు.. ఉచితంగా మందులు కూడా ఇస్తుంది. అనితర సాధ్యమైన ఈ సేవా కార్యక్రమాలను ప్రజలతో పాటు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
నిజం కావాలా.. భజన కావాలా అనే నినాదంతో మీడియా రంగంలోనికి ప్రవేశించిన బిగ్ టీవి.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుంది. నిఖార్సైన వార్తలను అద్భుతంగా ప్రజలకు అందిచడంతో పాటు.. జనాలను చైతన్యపరుస్తూ.. పేదల పక్షంగా నిలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా.. వ్యవస్థలు నడుస్తున్న సమయంలో బిగ్ టీవీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే.. పేద ప్రజలు ఉన్న చోటే క్యాంపులు ఏర్పాటు చేసి.. వారి వద్దకే వెళ్లి.. టెస్ట్‌లు నిర్వహించడం, వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తూ.. పేదలకు భరోసా ఇస్తోంది బిగ్ టీవి.
ప్రజలందరు ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు కూడా. తమ ఆరోగ్య సమస్యలు చెప్పి.. డాక్టర్స్ దగ్గర నుంచి సరైన సలహాలతో పాటు.. ఉచితంగా మందులు తీసుకెళుతున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపు పెట్టడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఉచిత వైద్య శిబిరం పెట్టండి అని అడుగుతుంటే.. బిగ్ టీవి మెడికల్ క్యాంపు ఎంతటి ఉపయోగకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతో పాటు.. గ్రామీణ ప్రాంత వాసులకూ ఉచిత వైద్య సాయం అందేలా బిగ్ టీవి పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతుంది. ఎలాంటి లాభపేక్ష ఆశించకుండా.. ప్రజలకు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తోంది. మెగా హెల్త్ క్యాంపులకు సహకరిస్తున్న వారికి బిగ్ టీవి తరుపున ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. క్యాంపుల వివరాలు తెలుసుకుంటున్న రాజకీయనేతలు.. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే.. బిగ్ టీవీ సేవాదృక్పదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సీజనల్ వ్యాధులతో పాటు.. దీర్ఘకాలికాలికంగా ఉన్న జబ్బులను నయం చేయటం.. పేదలకు మందులు ఉచితంగా అందించడంతో బిగ్ టీవీ చేస్తున్న కృషికి పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కనీసం రవాణా సదుపాయం లేని గ్రామంలో.. బిగ్ టీవి మెడికల్ క్యాంపు
మారు మూల పల్లెలు.. కొండల మాటున ఉన్న గిరిజన గూడాలు. పట్టణాల్లో వైద్యానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే 200లకు పైగా ఫ్రీ మెగా క్యాంపు నిర్వహించింది. యాభై వేల మందికి పైగా ఉచితంగా వైద్యపరీక్షలు, మందులు ఇస్తున్నారు. 100 మందికి పైగా పైసా ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్లు.. అందరికి తమ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు బిగ్ టీవి చేస్తున్న ప్రయత్నం ఇది ఆరంభం మాత్రమే. మనం ఆరోగ్యంగా ఉంటే.. మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. అందుకే బిగ్ టీవి మెగా మెడికల్ క్యాంపుకు తరలిరండి. వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకోండి.
తాజాగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో 203వ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించనుంది. మా శారదా హాస్పిటల్ వారి సౌజన్యంతో మార్చి 2వ తేదీనా వికారాబాద్ మండలం సిద్దులూరు గ్రామంలో మెగా ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించనుంది. వైద్య పరీక్షలు, మందులు ఉచితం.. తరలి రండి.. ఆరోగ్యంగా వెళ్లండి.