E-Paper
Advertisement

BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీల్లో గట్టిపోటీ ఇచ్చామని పార్టీ కేడర్ కష్టపడ్డారని పేర్కొంటుంది. అన్నింటిలోనూ అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది. పెరిగిన పోలింగ్ శాతం, కాంగ్రెస్ రెండేళ్ల ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆపార్టీ మున్సిపల్ ఇన్ చార్జులు దీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని పేర్కొంటుంది. ఇదే రిపోర్టుకు పార్టీ అధినేత కేసీఆర్ కు అందజేసినట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో సక్సెస్..

బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయమే లక్ష్యంగా పావులు కదిపింది. అన్ని మున్సిపాలిటీలకు అసెంబ్లీ పార్టీ ఇన్ చార్జులతో పాటు మున్సిపాలిటీలకు ఇన్ చార్జులను నియమించింది. వార్డుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. పోలింగ్ ముగిసేవరకు పర్యవేక్షణ చేశారు. అయితే అన్నిమున్సిపాలిటీల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. తెలంగాణ భవన్ నుంచి మానిటరింగ్ చేశారు. ఏ వార్డులో పార్టీ బలహీనంగా ఉందో తెలుసుకొని నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. దీంతో ఈ ఎన్నికల్లో సక్సెస్ అయ్యామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 30 నుంచి 40 మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువమున్సిపాలిటీల్లో విజయకేతరం ఎగురవేస్తామనివాటితో పాటు7 కార్పికేషన్లలోనూ ఒకటిరెండింటిలో విజయం సాధిస్తామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కొన్నిప్రవేటు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో గులాబీపార్టీ 30శాతం ఓట్లు సాధించినట్లు స్పష్టమయ్యాయి. దీంతో గులాబీ నేతల్లో మరింత ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల

పెరిగిన పోలింగ్ శాతం..?

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్, వృద్ధులకు పింఛన్ పెంపు చేయకపోవడం, మహిళలకు మహాలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ప్రజలు ఉన్నారని ఇదే తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ప్రజలకు వివరించామని, అందరూ గులాబీ పార్టీ రావాలని కోరుకుంటున్నారని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిమని అభిప్రాయపడుతున్నారు. పెరిగిన పోలింగ్ శాతం సైతం తమకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చామని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేశారని పేర్కొంటూ ఏయే మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామనే లెక్కలు వేసుకుంటున్నారు.

గట్టిపోటీ ఇచ్చాం..

పార్టీ అధినేత కేసీఆర్ కు మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్ చార్జులు రిపోర్టులు ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ఏయే మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటాం.. వైస్ చైర్మన్ ఏయే మున్సిపాలిటీల్లో కైవసం చేసుకుంటాం.. ఎక్కడెక్కడ గట్టిపోటీ ఇచ్చాం.. కాంగ్రెస్ తో ఎన్ని మున్సిపాలిటీల్లో పోటీపడ్డాం.. బీజేపీతోనూ ఎన్నింటిల్లో పోటీ ఇచ్చామనే వివరాలతో కూడిన నివేదికను ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నేతల పనితీరును సైతం ఆ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాదు మున్సిపాలిటీల్లో సహకరించని నేతల వివరాలను సైతం కేసీఆర్ కు ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరించిన వారి పేర్లను సైతం ఇచ్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో విస్తృత చర్చజరుగుతుంది.

Also Read: AP Mandali Session-2026: మండలిలో పెన్షన్ పై రచ్చ.. అధికార-విపక్షాల మధ్య మాటకు మాట

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×