E-Paper
Advertisement

AP Mandali Session-2026: మండలిలో పెన్షన్ పై రచ్చ.. అధికార-విపక్షాల మధ్య మాటకు మాట

AP Mandali Session-2026: మండలిలో పెన్షన్ పై రచ్చ.. అధికార-విపక్షాల మధ్య మాటకు మాట
Advertisement

AP Mandali Session-2026: ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై రచ్చకు దారి తీసింది. తాము ఎక్కువ ఇచ్చామని వైసీపీ చెబుతుంటే, కాదు మేమే ఇచ్చామని పాలక పక్షం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఏ పార్టీ హయాంలో ఎంతమంది పెన్షన్లు ఇచ్చారో లెక్కలతో సహా వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.

మండలిలో పెన్షన్ పై రచ్చ.. 

Advertisement

ఏపీ బడ్జెట్ సమావేశాలు మండలిలో వేడెక్కాయి. వివిధ అంశాలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గురువారం సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు కంపెనీలకు భూములు కేటాయింపు, ఏపీలో పెన్షన్లు వ్యవహారంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. దీనిపై పాలకపక్షం సమాధానం ఇచ్చింది.

2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంలో 34 లక్షల మంది పెన్షన్లు ఇచ్చినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దాన్ని తాము 55 లక్షలకు చేసినట్టు వైసీపీ సభ్యులు చెప్పినట్టు వివరించారు. తాము ఇప్పుడు ఇస్తున్నది నాలుగు వేల రూపాయలని తెలియజేశారు. గతంలో పెన్షన్లు 1125 రూపాయాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తాము ఏనాడూ తప్పు చెప్పలేదని, మాట తప్పలేదంటూ విపక్షానికి కౌంటరిచ్చారు.

Advertisement

కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు, వికలాంగులకు ఆరువేలు, కిడ్నీ బాధితులకు 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర చేయని విధంగా 54 వేల కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇచ్చామన్నారు. వైసీపీ హయాంలో 64 లక్షల మందికి ఇచ్చామని, ఇప్పుడు 60 లక్షల మందికి ఇస్తున్నట్లు తెలిపారు.

అధికార-విపక్షాల మధ్య మాటకు మాట

ప్రతీనెల మరణాలు ఉంటాయని, తగ్గినవి మరణించినవారని వివరించారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకుండే మరుసటి నెలలో దాన్ని క్యాన్సిల్ చేసేవారని, మా ప్రభుత్వంలో తొలి రెండు నెలలు తీసుకోకున్నా, మూడో నెలలో మొత్తమంతా తీసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు.

వైసీపీ హయాంలో భర్త మరణిస్తే.. భార్యకు పెన్షన్ ఇవ్వలేదన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్త చనిపోయిన వారుంటే భార్య ఇవ్వాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని, దాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు రకరకాలుగా నిబంధనలు పెట్టి పెన్షన్లు తొలగించారని ఎదురుదాడి మొదలుపెట్టారు. చాలా కులాలకు 50 ఏళ్లకు పెన్షన్లు ఇచ్చామని, మిగిలినవారికి ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ: కంపెనీలకు భూకేటాయింపులు ఇష్యూ.. వైసీపీ ప్రశ్నల వర్షం, మంత్రి లోకేష్ రిప్లై

మంత్రి సమాధానాలపై బొత్స మళ్లీ ప్రశ్నలు రైజ్ చేశారు. 19 నెలల కాలంలో 60 ఏళ్లు నిండినవారికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? తాము పెట్టిన ఎలిజిబులిటీ రూల్స్‌ని ఏమైనా మార్పులు చేశారా అంటూ ప్రశ్నించారు. ఎంతమంది ఉన్నారు? దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రిప్లై ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ఏ ఒక్క పెన్షన్ తొలగించలేదన్నారు.

4 లక్షల 70 వేల మంది మరణిస్తే.. సుమారు 2 లక్షల 70 వేల మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. ప్రస్తుతం 63 లక్షల 20 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. కొత్త పెన్షన్ల గురించి అధ్యాయనం చేస్తున్నామని తెలిపారు. గతంలో అవకతవకలు జరిగాయన్నారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో సుమారు 10 లక్షల పెన్షన్లను తొలగించారన్నారు. తాము ఏ ఒక్కరినీ తొలగించలేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×