E-Paper
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!
Advertisement

Mannе Krishank: ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఫల్యాలపై నెల రోజులుగా ప్రశ్నిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై దుష్ప్రాచారం తప్ప ఏమిలేదన్నారు.

22ఏ పేరుతో..

ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. మేము చేస్తున్న ఆరోపణలకు డాక్యుమెంట్స్ ఉన్నాయని, పూర్తి వివరాలు బయట పెడతామన్నారు. ఆరోపణలపై ఒక్కసారికూడా సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రభుత్వ అసమర్దతోనే రైతులకు క్రాప్ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. 22ఏ పేరుతో నిషేదిత భూముల దందా చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో 50 వేల కోట్లు సీఎం కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

ఏమైనా అయిందా?

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతుందని బీజేపీ ట్విట్ చేస్తారుకానీ కమీషన్ ఎందుకు వేయరని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భూదోపిడి చేస్తుందన్నారు. కేసీఆర్ వ్యవసాయం చేస్తే ప్రజలకు ఇబ్బంది ఏమైనా అయిందా? వ్యవసాయం చేసుకుంటే ఉరితీయాలా? ..మరి భూ దోపిడీని చేసేవారిని ఏం చేయాలని ప్రశ్నించారు. షాబాద్ లో 22ఏ నిషేధిత జాబితాలో లావణ్య పట్టా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామన్నారు. కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.

Also read: ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

Tags

Related News

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

చెడు చేసేవారికి ఎప్పటికీ విజయముండదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

Big Stories

Advertisement
×