MLC Kavitha: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన న్యూస్ ఆఫీసుపై దాడి కేసులో ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతో ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేసారని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణగా ఉన్న గన్‌మెన్స్‌పై దాడిచేసి వారి వద్ద తుపాకిని బలవంతంగా లాక్కొని తనను చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో ప్రస్తావించారు మల్లన్న.
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొన్నిరోజులుగా ఎమ్మెల్సీ కవిత చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా తీన్మార్ మల్లన్న-కవిత మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇద్దరు నేతలు బీసీలను తమవైపు తిప్పుకునే పనిలో మాటలకు పదును పెట్టారు. ఫలితంగా కేసు నమోదు వరకు వెళ్లింది. ఇరువురు నేతలపై కేసులు నమోదు అయ్యాయి.
బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లన్న న్యూస్ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కవిత. స్వయంగా వినతి పత్రాన్ని అందజేశారు. కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్నపై జాగృతి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: తేలు కుట్టిన దొంగలా బీఆర్ఎస్.. కవిత ఎపిసోడ్‌పై నో రియాక్షన్
ఆయనపై కూడా కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఎవరికీ బుల్లెట్ గాయాలు కాలేదని మల్కాజ్‌గిరి జోన్ డీసీపీ తెలిపారు. న్యూస్ కార్యాలయంపై దాడి విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు డీసీపీ. సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న డీసీపీ, మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు.
బుల్లెట్‌లకు సంబంధించిన షెల్స్ కోసం గాలింపు చేపట్టారు. కొన్ని బుల్లెట్‌లు రూఫ్‌కి తగలాయి. మరికొన్ని గ్లాస్‌కు తగిలినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని మల్కాజిగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై కారు పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
కవిత వ్యవహారంపై పార్టీ ఎందుకు సైలెంట్ అయ్యింది? ఘటన వెనుక ఉన్నది ఎవరంటూ చర్చించుకోవడం ఆ పార్టీ నేతల వంతైంది. గత అసెంబ్లీ సమావేశాల్లో లాబీల్లో కేటీఆర్‌తో మల్లన్న పలు అంశాలపై చర్చించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ దాడి వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు
తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు
కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై, తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు
సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి… https://t.co/Wktn08lhj3 pic.twitter.com/Whk2YiHScg
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2025