BigTV English

Nindu Noorella Saavasam Serial Today July 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ, అమర్‌      

Nindu Noorella Saavasam Serial Today July 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ, అమర్‌      

Nindu Noorella Saavasam Serial Today Episode:  చిత్ర, మనోహరి తమ ప్లాన్స్‌ అట్టర్‌ ప్లాప అయ్యాయని ఒకరికొకరు చెప్పుకుని బాధపడతుంటారు. ఇదంతా మనం ఒకరికొకరం చెప్పుకోకపోవడం వల్లే జరిగిందని అనుకుంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటుండుగా ఆకాష్‌ రూంలోకి వస్తాడు. ఆకాష్‌ను చూసిన చిత్ర, మనోహరి షాక్ అవుతారు. చిత్ర కోపంగా చూస్తూ.. ఆకాష్‌ కామన్‌సెన్స్‌ ఉందా నీకు. మ్యానర్స్‌ ఉందా నీకు.. నా పర్మిషన్‌ లేకుండా నా రూంలోకి ఎందుకు వస్తావు అంటూ అరుస్తుంది.


దీంతో ఆకాష్‌ భయంగా అంటే పిన్ని అది ఆడుకుంటూ.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. చిత్ర కోపంగా ఇంట్లోనా ఆటలాడేది..? చెప్పు.. ఇంట్లోనా..? నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావా..? ఆడుకోవడానికి అంటూ కోప్పడుతుంది. మనోహరి చిత్రా…? అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఆగు మను అరే వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను. అల్లరికి హద్దు లేకుండా పోతుంది. వీళ్లను ఇప్పటి వరకు ఎవ్వరూ కంట్రోల్‌లో పెట్టలేదు కాబట్టే ఇలా తయారయ్యారు. ఆకాష్‌ ఇంకోసారి ఇలా నా రూంలోకి పర్మిషన్‌ లేకుండా వస్తే ఇలా మాటలతో చెప్పను వెళ్లు అంటూ గద్దిస్తుంది. దీంతో ఆకాష్‌ ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు అని అడుగుతుండగానే చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా..? అంటూ ఆకాష్‌ను బయటకు తోసేస్తుంది. ఆకాష్‌ డోర్‌ దగ్గర కిందపడతాడు. ఏడుస్తూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు.

కింద పూలమాల కడుతున్న రాథోడ్‌ పాపం పిల్లలు ఎక్కడ దాక్కున్నారో ఆకాష్‌ బాబుకు చెప్పి ఉండాల్సింది మిస్సమ్మ అంటాడు. మనం చెప్పేస్తే థ్రిల్‌ ఏముంది రాథోడ్‌ పిల్లలు కదా వాళ్లను ఆడుకోనివ్వు అంటుంది. ఇంతలో ఆనంద్‌, అమ్ము హాల్లోకి వచ్చి మిస్సమ్మ ఆకాష్‌ ఎటు వెళ్లాడు అని అడుగుతుంది అమ్ము. మిమ్మల్ని వెతుక్కుంటూ పైకి వెళ్లాడు అని మిస్సమ్మ చెప్తుండగానే ఆకాష్‌ వస్తుంటాడు. ఆకాష్‌ను చూసిన అమ్ము ఆకాష్‌ ఏంటి ఏడుస్తున్నాడు అంటూ కంగారుపడుతుంది. మిస్సమ్మ, రాథోడ్‌ చూసి ఆకాష్‌ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఆకాష్‌ పలకడు. ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అమ్ము అడుగుతుంది. కిటికీ దగ్గర నుంచి చూస్తున్న ఆరు ఆకాష్‌ను ఎవరైనా తిడితే తప్పా ఏడవడు గుప్తగారు. అంటే పైన ఎవరో ఆకాష్‌ను గట్టిగా తిట్టారు అంటుంది.


నీ కుటుంబం అంతా ఇచ్చటనే ఉన్నది కదా మరి నీ పిల్ల పిచ్చుకను పైన ఎవరు తిట్టినరు అని అడుగుతాడు. ఆకాష్‌ ఏడుస్తూ చిత్ర పిన్ని తిట్టింది అని చెప్తాడు. ఆ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. చిత్ర తిట్టిందా..? ఎందుకు అని మిస్సమ్మ అడగ్గానే.. ఆకాష్‌ పైన రూంలో జరిగిందంతా చెప్తాడు.  మిస్సమ్మ కోపంగా రాథోడ్‌ చిత్రను కిందకు రమ్మను అంటుంది. మిస్సమ్మ ఆవేశపడకండి సార్‌ చెప్పింది అని రాథోడ్‌ గుర్తు చేయగానే.. మిస్సమ్మ సైలెంట్‌ అవుతుంది. ఆరు మాత్రం కోపంగా దానికి ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డ మీద చెయ్యి వేస్తుంది. దాన్ని నేను వదిలిపెట్టను.. నాశక్తులన్నీ వాడితే దానికి ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చూపిస్తాను.. ఇంకోసారి నా బిడ్డ జోలికి రాకుండా చేస్తాను అంటూ కోపంగా ఆరు వెళ్లిపోతుంటే.. బాలిక ఆగుము అది విధికి విరుధ్దం అని నీకు తెలియదా..? అంటాడు గుప్త. అందుకని అది నా బిడ్డను ఇంతలా బాధపెడుతుంటే.. నేను చూస్తూ ఊరుకోవాలా.. అంటుంది ఆరు.

ఎవరు చేసిన పాపాలు వారు అనుభవించక తప్పదు నువ్వు ఓపికతో ఉండుము ఆ బాలిక కర్మను చూడుము అంటాడు గుప్త. ఆరు కూడా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో బయటి నుంచి పరుగెత్తుకుని వచ్చిన అంజు ఏరా నేను ఆటలో ఉన్నానన్న విషయం మర్చిపోయారా..? ఏమైంది ఆకాష్‌.. ఎందుకు ఏడుస్తున్నావు…? మిస్సమ్మ ఏమైంది.. ఎవరో ఒకరు చెప్పండి అంటూ అంజు గట్టిగా అడగ్గానే అమ్ము జరిగింది చెప్తుంది. అంజు కోపంగా ఇక చాలు అమ్ము తప్పు చేసిన వాళ్లు సారీ చెప్పాలి కదా..? ఆకాష్‌ చిత్ర పిన్ని సారీ చెప్తుంది వినడానికి రెడీగా ఉండు అంటుంది. మిస్సమ్మ కూల్‌గా అంజు వద్దు.. అంటుంది. రాథోడ్‌ కూడా అంజు పాప ఇంతటితో ఆపేద్దాం ఎందుకు అనవసరమైన గొడవ అంటాడు. అంజు కోపంగా ఇక ఆపండి పది నిమిషాలు పదే పది నిమిషాలు గొడవ నేను సెటిల్‌ చేస్తాను. తప్పుకోసండి అంటూ అంజు కోపంగా పైకి వెళ్తుంది. ఏం చేస్తుందో గుప్త గారు మనం పైకి వెళ్దాం రండి అంటూ వెళ్తారు. అంజు నాటకం ఆడి చిత్ర చేత సారీ చెప్పిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు.

తర్వాత మిస్సమ్మ రూంలో ఫ్యాన్‌ క్లీన్‌ చేయడానికి అమర్ హెల్ఫ్ చేస్తాడు. మిస్సమ్మను ఎత్తుకుని నిలబడతాడు. ఇంతలో అమర్‌ కంట్లో నలుసు పడుతుంది. అమర్‌ అయ్యో అని అరవగానే మిస్సమ్మ కంగారుగా కిందకు దిగి అమర్‌ కళ్లల్లోకి చూస్తూ తన నోటితో ఊదుతుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్‌ క్రియేట్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Chhaava: సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న రష్మిక ఛావా.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Actress Harshitha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి… బేబీ ఆన్ ద వే అంటూ!

Actress : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Intinti Ramayanam Today Episode: పార్వతి పై అక్షయ్ సీరియస్.. పల్లవికి మరో షాక్.. భరత్, ప్రణతి ల కొత్త కాపురం..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేసిన గుణ.. గుండెలు పగిలేలా ఏడ్చిన మీనా.. విడిపోతారా..?

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట్లో వ్రతం.. వేదవతికి టెన్షన్.. అడ్డంగా బుక్కవ్వబోతున్న వల్లి..

Big Stories

×