BigTV English

OTT Movie : ఒకేసారి నలుగురు స్కూల్ పిల్లల ఆత్మహత్యలు… క్షుద్ర పూజలతో హడలెత్తించే కొరియన్ హర్రర్ మూవీ

OTT Movie : ఒకేసారి నలుగురు స్కూల్ పిల్లల ఆత్మహత్యలు… క్షుద్ర పూజలతో హడలెత్తించే కొరియన్ హర్రర్ మూవీ

OTT Movie : కొరియన్ సినిమాలను ఇప్పుడు తెగ చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలు మన ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతున్నాయి. కొరియన్ లవ్ స్టోరీలను, థ్రిల్లర్ సినిమాలను చూడటానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా టీన్ డ్రామా స్టైల్‌లో జెలసీ, ఘోస్ట్ సీన్స్‌ తో చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఇందులో నలుగురు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక్క అమ్మాయి మాత్రమే చనిపోవడంతో, ఇన్వెస్టిగేషన్ ట్విస్టులతో మెంటలెక్కిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే

జుంగ్-ఉన్ అనే యువతికి తన సోదరి ఉన్-జూ స్కూల్ లో మరణించినట్టు తెలుస్తుంది. ఇది సూసైడ్ అని అధికారికంగా చెప్పబడుతుంది. కానీ జుంగ్-ఉన్‌కి అనుమానం వస్తుంది. ఉన్-జూ మరణానికి ముందు రాత్రి, ఆమె మరో ముగ్గురు ఫ్రెండ్స్ సో-హీ, యూ-జిన్, ఎఉన్-యౌంగ్ తో ఒక బ్లడ్ ప్లెడ్జ్ చేస్తారు. వీళ్లు కాథలిక్ గర్ల్స్ హై స్కూల్‌లో సీనియర్స్. వాళ్ల మధ్య డీప్ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. కానీ వాళ్లు కలిసి మరణించాలని, ఎవరైనా సర్వైవ్ అయితే మిగిలినవాళ్లను చంపాలని బ్లడ్‌తో సైన్ కూడా చేస్తారు. కానీ ఉన్-జూ మాత్రమే రూఫ్ నుంచి జంప్ చేసి చనిపోతుంది. మిగిలిన ముగ్గురు సేఫ్‌గా ఉంటారు. స్కూల్‌లో రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. కానీ ముగ్గురు ఫ్రెండ్స్ మౌనంగా ఉంటారు.

షట్. జుంగ్-ఉన్ ఈ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతుంది. ముగ్గురు ఫ్రెండ్స్‌తో మాట్లాడి, స్కూల్ రికార్డ్స్ చెక్ చేస్తుంది. ఈ సమయంలో ఉన్-జూ మరణానికి ఈ ముగ్గురూ బాధపడుతుంటారు. కానీ వాళ్లకి భయంకరమైన హాల్యుసినేషన్స్ వస్తుంటాయి. వాళ్లు ఉన్-జూ ఘోస్ట్ వాళ్లను హాన్ట్ చేస్తోందని ఫీల్ అవుతారు. రక్తంతో కలిపిన మొహం, విస్పర్స్, స్కూల్ కారిడార్స్‌లో నీడలతో వచ్చే ఈ హారర్ ఎలిమెంట్స్ వాళ్ల మధ్య గిల్ట్ పెంచుతాయి. ఫ్లాష్‌బ్యాక్స్ ద్వారా వాళ్ల ఫ్రెండ్‌షిప్ గతం బయటపడుతుంది. వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్, కానీ జెలసీ వల్ల ఫ్రెండ్ షిప్ క్రాక్ అవుతుంది.


సో-హీ, ఉన్-జూ మధ్య ఒక డీప్ బాండ్ ఉండేది. కానీ యూ-జిన్, ఎఉన్-యౌంగ్ జాయిన్ అయ్యాక సో-హీ ఉన్-జూ‌ని సైడ్ చేస్తుంది. ఈ బ్యాక్‌స్టోరీలతో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య రిఫ్ట్ పెరుగుతుంది. వాళ్లు ఒకరినొకరు అనుమానిస్తారు. జుంగ్-ఉన్ ఈ సీక్రెట్స్‌ను ఛేదించడానికి మరింత డీప్‌గా వెళ్తుంది. స్కూల్ యాడ్మిన్, ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో మాట్లాడుతుంది. క్లైమాక్స్‌లో ఉన్-జూ మరణం వెనుక హిడెన్ ట్రూత్ షాకింగ్‌గా ముగుస్తుంది. ఉన్-జూ మరణం వెనుక అసలు రహస్యం మీరుకూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ హారర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘ఎ బ్లడ్ ప్లెడ్జ్’ (A blood pledge) లీ జాంగ్-యాంగ్ దర్శకత్వంలో వచ్చిన కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఓ యెన్-సో (జూ యూన్-జో), జాంగ్ క్యుంగ్-ఆ (సో-హీ), సాన్ యూన్-సో (యూ-జిన్), సాంగ్ చే-యూన్ (ఈన్-యూంగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009 జూన్ 18న విడుదలై, IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. 1 గంట 28 నిమిషాల నిడివితో అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యూబీ, ప్లూటో టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్, ఇంగ్లీష్ భాషలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : కేర్ టేకర్ పై మనసు పడే పెళ్లి కాని ప్రసాదు… ఫీల్ గుడ్ మలయాళ ఫ్యామిలీ డ్రామా

Related News

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే

Big Stories

×