Bigg Boss 9 Telugu day 3: హౌజ్ లో కామనర్స్ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన పవర్స్ తో మరింత రెచ్చిపోతున్నారు. మూడో రోజు కూడా నామినేషన్స్ కొనసాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో తనజ.. సంజనని, రామ్ రాథోడ్.. సుమన్ శెట్టి నామినేట్ చేశారు. ఇక ఇవాల్టీ ఎపిసోడ్ లో భరణి, ఇమ్మాన్యుయేల్ సుత్తి కోసం పోటీ పడగా.. భరణి గెలిచాడు. తన వంతుగా సంజనానిన నామినేట్ చేసి.. జడ్జిమెంట్ కోసం ఓనర్స్ నుంచి శ్రీజ దమ్ముకు సుత్తి అందించాడు. ఇక నామినేషన్ లోకి వచ్చిన శ్రీజ.. భరణి డిసిజన్ కి ఒకే చేసినట్టుగా.. సంజనా దుమ్ము దులిపింది. మీ బిహెవిర్ చాలా డిఫరెంట్ గా ఉందని, హౌజ్ అంత బాత్ రూంలో నుంచి షాంపూ, కండిషన్ తీసేయండి అని చెప్పిన వినడం లేదు.
హౌజ్ అంత కాదు మీ వల్ల ఆరుగురు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినా.. మీరు స్టాండ్ తీసుకోలేదు. నేను అలాగే ఉంటా.. అంటూ ఆ స్టాండ్ మీదే ఉన్నారు. ఇంట్లో నలుగురు ఇబ్బంది అంటే మన తీరు మార్చుకుంటాం. అలాంటిది బిగ్ బాస్ హౌజ్ ఇంత మంది ఇబ్బంది పడుతున్నారు మీరు మీ స్టాండ్ మీదే ఉన్నారు అంటూ సంజనను కడిగిపారేసింది. అయితే చివరిలో ట్విస్ట్ ఇచ్చింది. తన నామినేషన్ సంజన కాదని, తనూజ అని చెప్పి షాకిచ్చింది. ఇక తనూజ నామినేట్ చేయడానికి కారణాలు చెప్పింది. మొదటి నుంచి చూస్తున్నా.. మీరు ముందు ఒకలా వెనకలా ఒకలా ఉంటున్నారు. ఫస్ట్ డేనే మీరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కామనర్స్ ని చాలా అలా ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ డే నుంచి మీ దగ్గర నుంచి కామెంట్సే వింటున్నా.
వంట కూడా మాకు కావాల్సింది చేయడం లేదు. బిగ్ బాస్ మాకు ఏం కావాలంటే అది చేయించుకోవాలని చెప్పారు. కానీ, మీరు మాకు కావాల్సింద కాకుండా మీకు నచ్చినట్టు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. దీనికి తనూజ ఏదో సమాధానం చెబుతుండగా మనుషుల్లా చూడట్లేదు అంటున్నారు.. అది వెరీ రాంగ్.. అని డీమన్ పవన్ అన్నాడు. ఎక్కడో ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్లు అనిపించింది.. అని తనూజ వంట గురించి శ్రీజ పాయింట్ లేపింది. దీనికి తనూజ.. మీరు అందరి కలిసి ఒకటి చెప్పండి.. ఒకరు ఒకసారి వచ్చి ఇది చేయమంటారు.. మరోకరి అది చేయంటారు. అప్పుడు మాకు ఎలా తెలుస్తుంది. అయినా చేసిన ఫుడ్ బాగుంది, మేమేప్పుడు ఇలాంటి తినలేదు అంటూ లోట్టలేసుకుని తిని ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ తనూజ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఆ తర్వాత మధ్య లో మాస్క్ మ్యాన్ హరీష్ రంగంలోకి దిగాడు. ఫుడ్ తిన్నారు అంటే ఏంటీ.. మీ నీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామా అంటూ తనుజ పైకి రైజ్ అయ్యాడు.
మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారంటూ తనూజ తనని డిఫెండ్ చేసుకుంటుండగా.. అదే.. అదే మీరు. ఎదుటి వాళ్లకు కాస్తా గౌరవం ఇవ్వండి.. మీ బాడీ లాంగ్వేజ్, మీ మాటే బాలేదు.. అని తనూజ గురించి అన్నాడు హరీష్. నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాట గురించి మాట్లాడే రైట్ మీకు లేదు.. అంటూ తనూజ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అలాగే నిన్న నామినేషన్ పోటీ రితూ గాయంపై క్వశ్చన్ చేసింది. ఆమె గాయంతో బాధపడుతుంటే.. ఎలా తగిలిందిరా అంటూ లేని కన్ సర్న్ చూపించావు అనగా.. రితూ కూడా దీనికి అగ్రీ చేసింది. తనూజ నిన్ను బయట కూడా చూశా.. నువ్వు ఎప్పుడు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతావు అనిపిస్తుందంటూ రితూ కూడా తనూజని కార్నర్ చేసింది. ఇదంత అయిపోయాక.. తనూజ ఏడుపు మొదలు పెట్టింది. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం ఏంటీ? నేను ఇంతే.. నాకు నటించడం రాదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
దీంతో ఇమ్మాన్యేయల్, సంజనలు తనూజని ఓదారుస్తూ.. నువ్వు స్ట్రాంగ్ ఉండూ.. వాళ్లకు కరెక్ట్ సమాధానం ఇచ్చావటూ ఓదార్చారు. ఆ తర్వాత ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి లు పోటీ పడగా.. సుమన్ శెట్టి సుత్తి గెలిచి.. సంజనను నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఓనర్స్ లో ప్రియకు సుత్తి ఇచ్చాడు. ప్రియ.. రామ్ రాథోడ్ ని నామినేట్ చేసింది. ఇక టెనెంట్స్ నామినేషన్ అయిపోయాయి.. నామినేషన్ లో లేని భరణికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఓనర్స్ లో డేంజర్ జోన్ లో ఉన్న మనీష్, డిమోన్ పవన్ లో ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయమని చెప్పడంతో.. భరణి.. డిమోన్ పవన్ నామినేట్ చేశాడు. అతడి నిర్లక్ష్యపు ధోరణి వల్లే పవన్ నామినేట్ చేస్తున్నా అని చెప్పడంతో డిమోన్ పవన్ తనని డిఫెండ చేసుకున్నారు. నామినేషన్ ఒకే కానీ,నిర్లక్ష్యం ఉన్నాను అని అనడాన్ని యాక్సెప్ట చేయనంటూ తన పాయింట్స తాను చేప్పి డిఫెండ్ చేసుకున్నాడు. దీంతో తొలివారం నామినేషన్స్ ముగిశాయి. చివరకు ఈ వారం హౌజ్ నుంచి బయటకు వచ్చేవారి లిస్ట్ లో టెనెంట్స్ నుంచి ప్లోరా సైనీ, సంజన, తనూజ, రితూ చౌదరి, శ్రేష్టి వర్మ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, రామ్ రాథోడ్, ఓనర్స్ నుంచి డిమోన్ పవన్ లు నామినేషన్ లో ఉన్నారు.