Bigg Boss 9 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రోజుకో ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. రోజుకు ఒకరి రంగు బయటపడుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయలేకపోతున్నాం. ఒకరిని మించి ఒకరు గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా కామనర్స్ మాత్రం సెలబ్రిటీస్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అని క్లియర్ గా అర్థమవుతుంది.
ఏదేమైనా సెలబ్రిటీష్ ను ఓడించాలి అని ఆలోచనతో కామెనర్స్ ఉన్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా వాళ్ల గేమ్ ప్లాన్ చేస్తుంటే. అందరూ కూడా గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ లు బాగా చూసి వచ్చారు అని అర్థమయిపోతుంది.
బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది తనుజ. అడుగు పెట్టడంతోనే తను వంట బాగా చేస్తాను అని నాగర్జునతో చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా నాగార్జున కు కూడా మటన్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టింది. బహుశా అందుకేనేమో కళ్యాణ్ తనకి కిచెన్ డ్యూటీ అప్పజెప్పాడు. అలానే అందరికీ ఫుడ్ వండి పెడుతుంది తనుజ.
ఇక నామినేషన్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. ఇందులో భాగంగా తనుజ ఫుడ్ పెడుతుంది. కానీ ఏవేవో మాటలు అంటూ పెడుతుంది అని దమ్ము శ్రీజ చెప్పింది. ఆ మాటతో తనుజా కి మరియు శ్రీజ కి మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. మధ్యలో హరీష్, ప్రియా శెట్టి, రీతు చౌదరి వీళ్ళందరూ కలిసి తనూజ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతుంది అని అందరూ ఒకేసారి ఎక్కేసారు.
ఒక టాస్క్ లో భాగంగా రీతు చౌదరికి దెబ్బ తగిలింది. అయితే అప్పుడు ఎలా తగిలింది అని తనుజ వచ్చి రీతుని అడిగింది. అప్పుడు రీతు ఏమీ మాట్లాడలేదు. కానీ శ్రీజ మాత్రం రీతు టాపిక్ బయటకు తీసింది. మొత్తానికి కామనర్ అయిన శ్రీజ. రీతు చౌదరికి మరియు తనుజాకి మధ్య గొడవను సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేయగలిగింది.
బహుశా తనుజ లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడి ఉండొచ్చు. బట్ అవే మాటలని ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని స్లోగా కూడా చెప్పొచ్చు. కానీ వాళ్ళు అరుస్తూ చెప్పడం వలన తనుజ ఏడ్చింది. ఇక్కడితో సక్సెస్ఫుల్ గా కామనర్స్ మిషన్ సక్సెస్ అయింది అని చెప్పాలి. వాళ్లందరూ కలిసి ఆడుతున్నారు అని ఇమ్మానుయేల్ ఆల్రెడీ గెస్ చేశాడు. అందుకే తనజా ను ఓదారుస్తూ బాగా ఆడావ్ అని చెప్పారు.
Also Read: Megastar Chiranjeevi : చిరంజీవి భార్యకు భయపడతారా? కూతురు చెప్పిన కథ