Brahmamudi serial today Episode: దొంగ క్యారెక్టర్ వేయడానికి మా ఆంటీ నిరాకరించడంతో అప్పు అమాయకురాలు అనే ఈ కార్యక్రమంలో క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటూ మన ముందుకు శ్రీను, రమేష్ పాత్రలో మా అమ్మ నాన్నమ్మ ఎంటర్ అవుతున్నారు అని రాజ్ చెప్తాడు. పక్కనే ఉన్న రుద్రాణి ఇందాక దొంగ క్యారెక్టర్స్ వేశాం కాబట్టి మనల్ని కొట్టగలిగారు.. ఇప్పుడు ఎలా కొడతారో మనం చూద్దాం అంటుంది. నాకెందుకు డౌటుగా ఉంది మమ్మీ ఇంట్లో వాళ్లందరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఉన్నారు అంటూ భయంగా చెప్తాడు రాహుల్. వాళ్లు ఎన్ని ప్లాన్స్ వేసినా రాజ్, కావ్య ఇద్దరూ ఆ శ్రీను గాడి దగ్గరకు వెళ్లకపోవడమే మనకు కావాలి. కాస్త ఓపిక పట్టు మిగిలింది నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇస్తుంది రుద్రాణి.
మరోవైపు ఇంద్రాదేవి, అపర్ణ డబ్బులు పట్టుకుని శ్రీను, రమేష్ క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇస్తారు. ఇరికించడానికి డబ్బులు రెడీ అంటుంది ఇంద్రాదేవి, ఇరుక్కోవడానికి అమాయకురాలు కూడా రెడీ అంటుంది అపర్ణ, అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఇరికిద్దాం పద అంటుంది ఇంద్రాదేవి. సరే అంటూ ఇద్దరూ అప్పు దగ్గరకు వెళ్తారు. ఇంద్రాదేవి అలియాస్ శ్రీను మేడం అప్పు చెల్లించడానికి డబ్బులు రెడీ అంటుంది. డబ్బులు తీసుకోవడానికి నేను రెడీ అంటుంది అపర్ణ, అలియాస్ రమేష్. రెండో సారి బకరా అవ్వడానికి నేను కూడా రెడీ అంటూ ఇవ్వండి. అంటూ డబ్బులు తీసుకుంటుండగా.. ఇంద్రాదేవి ఆఫీసర్స్ అంటూ గట్టిగా పిలవగానే ఏసీబీ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ వేస్తున్న రాహుల్, రుద్రాణి పరుగెత్తుకుని వస్తారు. మీరు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు వెంటనే ఈ పోలీస్‌ను అరెస్ట చేయండి అని రుద్రాణి చెప్తుంది.
ఇంతలో ఇంద్రాదేవి ఆగండి అంటుంది. ఎందుకు ఆగాలి మీ దగ్గర ఈవిడ లంచం తీసుకుంది కదా అని రుద్రాణి అడుగుతుంది. తీసుకుంది కానీ మీరు నిజంగానే ఏసీబీ ఆఫీసర్లా..? లేకపోతే కాఫీ కొట్టి పాసైన కక్కుర్తి బ్యాచా..? అని అడుగుతుంది. మేము నిజాయితీ గల ఆఫీసర్లం.. అని రాహుల్ చెప్తాడు. అంత నిజాయితీ పరులైతే మేమిద్దరం ఇరికిండానికి వచ్చామని మీకు ముందే తెలుసు కదా..? రుద్రాణి తెలుసు అంటుంది. మేము దుర్మార్గులమని ఈ పాటికే మీకు అర్థం అయింది కదా..? అంటుంది ఇంద్రాదేవి. ఇప్పుడేంటి ఎప్పుడో తెలిసిపోయింది అని రుద్రాణి చెప్తుంది. మరి తెలిసినప్పుడు మమ్మల్ని పట్టుకుని అరెస్ట్ చేసి చావ గొట్టకుండా సిన్సియర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్‌ను సస్సెండ్ చేయాలని చూస్తారా..? అంటుంది అపర్ణ.
దీంతో రాహుల్ కోపంగా స్క్రిప్ట్ లో అలాగే ఉంది కదా అంటాడు. కానీ మా స్క్రిప్ట్ లో కొట్టమని ఉంది. అంటూ ఇద్దరూ కలిసి రాహుల్, రుద్రాణిని కొడుతుంటే.. మిగతా వాళ్లందరూ వచ్చి కొడతారు. దీంతో రుద్రాణి, రాహుల్ మాకు ఈ క్యారెక్టర్స్ వద్దు అంటూ బాధపడతారు. అత్తారింటికి దారేది సినిమాలో సీన్‌లా రాహుల్, రుద్రాణి ఎన్ని క్యారెక్టర్స్ మారినా అందరూ కలిసి వాళ్లనే కొడతారు. దెబ్బకు రుద్రాణి, రాహుల్ అక్కడి నుంచి పారిపోతారు.
బయటకు వెళ్లిన రుద్రాణి, యామినికి ఫోన్ చేస్తుంది. ఏంటి రుద్రాణి గారు అప్పు ఏసీబీ వాళ్లకు దొరికిపోవడంతో అత్తా కోడళ్ల మధ్య అంతరుద్ద్యం జరుగుతుందా అని అడుగుతుంది యామిని. ఏంటి జరిగేది అవతల ఆ కావ్య, రాజ్ కలిసి అప్పును బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వేదో గొప్పగా ప్లాన్ చేశావు అనుకుంటే ఇంత సింపుల్‌గా చేశావేంటి..? మనం ఒక్కసారి చెక్ పెట్టామంటే అపోనెంట్‌కు ప్లాన్ కూడా ఉండకూడదు. అది ప్లాన్ చేయడమంటే అని రుద్రాణి చెప్తుంది. దీంతో యామిని అసలు ఏం జరిగింది అని అడుగుతుంది.
రుద్రాణి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. నువ్వు ఎలా చేస్తావో.. ఏం చేస్తావో కానీ ఆ శ్రీను గాడు మాత్రం రాజ్, కావ్యలకు దొరక్కూడదు. వాడు దొరికాడంటే.. అప్పుకు శిక్ష పడటం కాదు.. నీకు శిక్ష పడుతుంది అంటూ హెచ్చరిస్తుంది. దీంతో యామిని శ్రీనుకు ఫోన్ చేసి నువ్వు అండర్ గ్రౌండ్‌కు వెళ్లు అని చెప్తుంది. అలాగే మేడం ఇప్పుడే వెళ్తాను అని చెప్పి తిరిగి చూడగా అక్కడ రేవతి ఉంటుంది. శ్రీను షాక్ అవుతాడు. ఎవరు శ్రీను ఫోన్ లో అని రేవతి అడగ్గా చెప్పడానికి శ్రీను తడబడతాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి త్వరగా రమ్మని కాల్ చేశాడు అందుకే వెళ్తున్నాను అక్కా అంటూ శ్రీను వెళ్లిపోతాడు.
ఇంద్రాదేవి ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటే స్వప్న, అపర్ణ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. దీంతో ఇంద్రాదేవి ఎవరి కంట్లో అయిత పడకూడదు అనుకున్నానో వారి కంట్లోనే పడ్డాను అనుకుంటుంది. ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శ్రీనును వెతుక్కుంటూ కారులో వెళ్తున్న రాజ్, కావ్య శ్రీను బైక్‌ను గుద్దబోతారు. దీంతో శ్రీను, రాజ్ ల మధ్య గొడవ జరగుతుంది. మరోవైపు ఇంద్రాదేవి సీక్రెట్‌గా వెళ్లి రేవతిని కలుస్తుంది. ఇంద్రాదేవిని చూసిన రేవతి ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?