Weather News: గడిచిన నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఆగస్టు రెండో వారంలో మొదలైన వర్షాలు.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ చివరి వారంలో కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్టేట్ ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇవాళ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజులు నార్త్, సెంట్రల్, సౌత్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి పిడుగుల వర్షం పడే ఛాన్ ఉందని చెప్పింది. హైదరాబాద్ లో పలు చోట్ల రాత్రి వేళల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వివరించింది.
రాబోయే గంట నుంచి రెండు గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇక భాగ్యనగరంలో బాలాపూర్, బడంగ్ పేట్, మీర్ పేట్, బీఎన్ రెడ్డి, హస్థినాపురం, ఆదిబట్ల, నాదెర్ గూల్, గుర్రాంగూడా, అల్వాల్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, బేగంపేట, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడొచ్చని వివరించారు.
ALSO READ: Viral video: పార్లమెంటును తగలబెట్టేసి రీల్స్ చేసిన జెన్ జెడ్ నిబ్బాలు.. ఇది అవినీతిపై పోరులా లేదే?
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు. రాత్రి వేళ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు వివరించారు.