Rangareddy News: బిర్యానీ.. ఈ పేరు చెబితేచాలు. నాన్‌వెజ్ ప్రియులకు నోరూరుతూ ఉంటుంది. వెంటనే ఆ బిర్యానీని ఆరగించాలని భావిస్తుంటారు. బిర్యానీ టెస్ట్ ఆ విధంగా ఉంటుంది. వీటిని పేరుతో సొమ్ము చేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుభ్రతను గాలి కొదిలేశాయి. వీటికి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో జీహెచ్ఎంసీ అధికారులు సోదాలు చేశారు.
విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నింటికి నోటీసులు ఇచ్చారు అధికారులు. పలు హోటళ్లు మూతపడ్డాయి. అప్పుడుగానీ హోటళ్లలో బిర్యానీ తయారు చేసే వాతావరణం, అందులో కలిసి వస్తువులు అన్నింటిని కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో బిర్యానీ తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నగరవాసుల్లో మొదలైంది.
హైదరాబాద్ సిటీలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాలేదు. ఒకవేళ బిర్యానీ తినడానికి హోటళ్లకు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురవుతున్నాయి.
తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో బిర్యానీలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. బిర్యానీలో ఆ బొద్దింకను చూసి కస్టమర్ జశ్వంత్ షాకయ్యాడు. హోటల్ నిర్వాహకులపై కారాలు మిరియాలు నూరాడు. దాన్ని ఫోటో తీసి ఆ హోటల్ గుట్టుని బయటపెట్టాడు. తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండియర్ హోటల్‌లో ఈ బాగోతం బట్టబయలైంది.
ALSO READ: క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్, ఔను కేటీఆర్-తాను కలిశాం
ఈ క్రమంలో ఆ కస్టమర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ యాజమాన్యానికి 25 వేల రూపాయలు జరిమానా విధించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. బిర్యానీ తినేందుకు రెడీగా ఉన్నానని, ఈలోగా బొద్దింక కనిపించడంతో నిర్వాహకుల దృష్టికి తెచ్చానని తెలిపాడు.
వినియోగదారుడు కావాలనే ఈ విధంగా రచ్చ చేస్తున్నాడని హోటల్ నిర్వాహకుల మాట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బిర్యానీలో బొద్దింగ పడిందంటే.. అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ అంటున్నారు. సిటీలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. చీటికి మాటికీ ఇలాంటివి చూసే బదులు బిర్యానీకి దూరంగా ఉంటే బెటరని మరికొందరి మాట.