E-Paper
Advertisement

Chamala Kiran: ప్రజాస్వామ్య పద్ధతిలో గళమెత్తుతాం.. ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు

Chamala Kiran: ప్రజాస్వామ్య పద్ధతిలో గళమెత్తుతాం.. ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది సభ్యులపై ఉన్న సస్పెన్షన్‌ను ఉపసంహరిస్తున్నట్లు లోక్ సభ విప్ సురేష్ అధికారికంగా సమాచారం అందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైన తరుణంలో ఈ నిర్ణయం రావడం విశేషం. ముఖ్యంగా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పైన చర్చలు జరిగే ఈ సమయంలో ప్రజాప్రతినిధులు సభలో ఉండటం ఎంతో కీలకం. భువనగిరి నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించి ఢిల్లీకి పంపింది కేవలం తెలంగాణ గళాన్ని వినిపించడానికేనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం పట్ల నిరసన తెలిపినందుకు తమను సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్ సభ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి 543 మంది ఎంపీలను సమాన దృష్టితో చూడాలని కోరారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాల ఒత్తిళ్లకు తలొగ్గి విపక్ష సభ్యులను ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాము రాజీపడబోమని చామల కిరణ్ స్పష్టం చేశారు. వచ్చే రెండు వారాల పాటు జరిగే సభలో రాష్ట్ర సమస్యలపై గట్టిగా నిలదీస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్ సభ్యులందరికీ మాట్లాడేందుకు తగిన సమయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తూ గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రజల పక్షాన నిలబడి పోరాడటం తన బాధ్యత అని భువనగిరి ఎంపీ పేర్కొన్నారు. సభలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని గుర్తు చేశారు. సస్పెన్షన్ ఎత్తివేతతో రేపటి నుంచి లోక్ సభలో తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడమే తన తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

ALSO READ: LPG Cylinder Booking: అర్రెర్రెరే.. చాట్ జీపీటీని దాటేసిన ఎల్పీజీ బుకింగ్ యాప్, దేశంలో ఏ జరుగుతోంది..?

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×