E-Paper
Advertisement

RV Karnan: ఓటీఎస్ ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టీకరణ

RV Karnan: ఓటీఎస్ ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టీకరణ
Advertisement

RV Karnan:  కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతం రాయితీ ఇస్తూ అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ కు ఇంకా 15 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, బకాయిదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఓటీఎస్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, నోటీసుల జారీ, మూడు కార్పొరేషన్లలోని ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ బకాయిలు, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ గుర్తించిన ఆయన వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 28 లక్షల 80 వేల 260 ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లుండగా, ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలో 8.82 లక్షల మేరకు రెసిడెన్షియల్, మరో 2.63 నాన్ రెసిడెన్షియల్ ఆస్తులున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ లో మొత్తం 11 లక్షల 45 వేల పీటీఐఎన్ లున్నట్లు కమిషనర్ తెలిపారు. కానీ డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఓటీఎస్ స్కీమ్ ద్వారా మూడు కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.323 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఓటీఎస్ ద్వారా లక్షా 11 వేల 835 ఆస్తుల నుంచి సుమారు రూ. 140 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసినట్లు, దీని ద్వారా దాదాపు రూ.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Also Read: BSNL Recharge Plan: రోజుకు రూ.6తో.. 164 రోజుల పాటు.. 300GB డేటా, అపరిమిత కాల్స్!

మొత్తం రూ. 51 కోట్ల వడ్డీ రాయితీ

మొత్తం మూడు కార్పొరేషన్ల పరిధిలో మొండి బకాయిలు చెల్లించిన వారికి మొత్తం రూ. 51 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు కార్పొరేషన్ లో ఈ నెల 15వ తేదీ వరకు సుమారు రూ. 2186 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేసినట్లు, ఇందులో జీహెచ్ఎంసీ రూ. 824 కోట్లు, సైబరాబాద్ లో రూ. 825 కోట్లు, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 478 కోట్లు వసూలైనట్లు ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 11.45 లక్షల పీటీఐఎన్ లు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లించిన మొత్తం పీటీఐఎన్ నెంబర్ల సంఖ్యను 6.31 లక్షలు కాగా, ట్యాక్స్ చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇండెక్స్ నెంబర్ల సంఖ్యను 5.13 లక్షలున్నట్లు ఆయన వివరించారు. దీంతో పాటు మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ట్యాక్స్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కఠిన చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జోనల్ స్థాయిలో 50 మంది టాప్

Advertisement

సర్కిల్ స్థాయిలో 30 మంది టాప్ డీఫాల్టర్లు, జోనల్ స్థాయిలో 50 మంది టాప్ డీఫాల్టర్లను గుర్తించి, తుది నోటీసులు జారీ చేసి, కలెక్షన్ ను స్పీడప్ చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. సిటీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించి పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇప్పటికే రెండు ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు కమిషనర్ ఓ ప్రశ్భకు సమాధానంగా వివరించారు. ఈ నెల 6వ తేదీ నుంచి కోర్ అర్బన్ రీజియన్ లో సర్కారు ప్రారంభించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నట్లు, మూడు కార్పొరేషన్లు రోజువారీగా థీమ్ ను ఎంపిక చేసుకుని పనులను ముమ్మరం చేసినట్లు కమిషనర్ వివరించారు. ఈ విలేఖర్ల సమావేశంలో అదనపు కమిషనర్( ఐటీ, ఫైనాన్స్) ప్రియాంక అల, అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, జాయింట్ కమిషనర్ (రెవెన్యూ) రజనీ కాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Readniharika konidela:పిల్లల్ని కనాలని ఉంది..పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×