E-Paper
Advertisement

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

1.సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న ప్రకాశం జిల్లా గుంటూరు లింగన్నపాలెంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

2. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వార్

అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. దళిత కాలనీలో RDT స్కూల్ స్థలాన్ని ఆక్రమించారని టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. అది RDT స్థలం కాదన్నారు టీడీపీ వర్గం. దీంతో వాళ్లు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయాలైన ఇరువర్గాల కార్యకర్తలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

3.ఆకస్మిక మృతి

మంత్రి కొలుసు పార్థసారథి రక్షణ ఎస్ఐ రంగనాథరావు ఆకస్మిక మృతి చెందాడు. మంత్రి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళుతుండగా.. గుడివాడ సమీపంలో గుండెపోటు రావడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు గుడివాడ డీఎస్పీ తెలిపారు.

4.పేకాట శిబిరం పై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట శివారులోని పేకాట శిబిరంపై దాడులు చేశారు పోలీసులు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9మందిని పట్టుకున్నారు. వారి నుంచి 38,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాయకులగూడెం గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి 8,610 నగదు స్వాధీనం చేసిని 9మందిని అరెస్ట్ చేశారు.

5. రాయలసీమకు నీరు అందించేందుకు ప్రయత్నాలు

పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాయలసీమకు నీరందించేందుకు గోదావరి జలాలను నల్లమల సాగర్‌కు తరలించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

6. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు

అల్లూరు జిల్లాలో నాలుగు రోజులుగా చలి విజృంభిస్తోంది. ఏజెన్సీలో చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పాడేరులో 14, చింతపల్లిలో 16, లంబసింగి 13గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటి రావడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

7. వైసీనీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 12న తలపెట్టిన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం కుట్రతో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

8. అక్రమ రవాణా

వే బిల్ లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద ఓవర్ లోడ్‌తో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.

9.పార్వతి కుండలేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వృద్ధ గౌతమీ నది తీరాన వెలసిన పార్వతి కుండలేశ్వరస్వామిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. అలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ, ఆలయ విస్తరణాధికారి కనకదుర్గ మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుండలేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి వాసంశెట్టి.

10. కాకినాడ జిల్లాలో కార్డెన్ సెర్చె

కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 45 బైకులను ఒక వ్యాన్‌ను సీజ్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు సీఐ శ్రీనివాస్. గుర్తు తెలియని వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

11. రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

కరీంనగర్ జిల్లా కొలనూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రేకుల షెడ్డు కూలడంతో వృద్ధురాలు రాజేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. పక్కింటి ఐలమ్మతో మాట్లాడేందుకు రాజేశ్వరి వెళ్లింది. మాట్లాడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు కూలడంతో రాజేశ్వరి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

12. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లి పీఎస్‌లో విషాదం చోటుచేసుకుంది. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సయ్యద్ రియాన్ ఉద్దీన్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13. పవన్‌కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకొని తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో..స్థానికులు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు వచ్చారు. తోపులాటలో హేమవతి అనే మహిళ కిందపడిపోయింది. ఆ సమయంలో పవన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఆమె కాలు మీద నుంచి వెళ్లిపోయింది. గుర్తించిన సిబ్బంది వెంటనే మహిళను ఆసుపత్రికి తరలించారు.

14.మోడీ పర్యటన

ప్రధాని మోడీ ఈ నెల 11, 12వ తేదీల్లో భూటాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ ఆధ్యాత్మిక, మౌలిక సదుపాయాల సంబంధిత కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోడీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో సమావేశమవుతారు. ఇరు దేశాలు కలిసి అభివృద్ధి చేసిన ఒక వెయ్యి 20 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

15. అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

16. డాగ్ స్కాడ్‌తో తనిఖీలు.. ఐఈడీ పేలి జవాన్ కు తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలడం కలకలం రేగింది. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తుండగా ఐఈడీ పేలింది. కరిగుండం శివారు అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ప్రమాదంలో జవాన్ ఫిరోజ్ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమకాలు నుజ్జునుజ్జు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ నిర్మాణం కోసం.. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తుండగా ఘటన జరిగింది.

17. ముగ్గురు టెర్రరిస్టులు అరెస్టు

అహ్మదాబాద్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. వారిలో ఒకడైన సయ్యద్ అహ్మద్‌ను హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అదుపులోకి తీసుకొని గుజరాత్‌కు తరలించారు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు ఏటీఎస్ పోలీసులు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది.

18. సెబీ మదుపరులకు హెచ్చరిక

బంగారం ధర పరుగులు పెడుతోంది. దీంతో పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇతర మార్గాల కోసం చూస్తున్నారు. ఈ సమయంలోనే చాలామందిని డిజిటల్‌ గోల్డ్‌ ఆకర్షిస్తోంది. డిజిటల్‌ గోల్డ్‌ పథకాలు అత్యంత నష్ట భయంతో కూడుకున్నవని.. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ మదుపరులకు హెచ్చరిక జారీ చేసింది. ఇవేవీ తమ నియంత్రణ పరిధిలోకి రావని, అందువల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేసింది.

19. వరల్డ్ రికార్డు సృష్టించిన క్రికెటర్

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. 25 ఏళ్ల ఆకాష్ 11 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో సూరత్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇతను వరుసగా 8 సిక్స్‌లు బాదేయగా.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా 8 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

20. రెమ్యునరేషన్‌పై మరోసారి చర్చ

రీసెంట్‌గా రిలీజైనా గర్ల్‌ఫ్రెండ్ మూమీ పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ పెరుగుతున్నాయి. దీంతో హీరోయిన్ రష్మిక రెమ్యునరేషన్‌‌పై మరోసారి చర్చ నడుస్తోంది. ప్రజెంట్ రష్మిక ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5,6 కోట్ల వరకు అందుకుంటోందని ఓఎ టాక్ వినిపిస్తుంది. గర్ల్‌ఫ్రెండ్ కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పడీ విషయం చర్చనీయాంశమైంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×