BigTV English

Game Changer OTT : ‘గేమ్ చేంజర్ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..?

Game Changer OTT : ‘గేమ్ చేంజర్ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..?

Game Changer OTT : పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకేక్కింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది.. ఈ మూవీ మొదటి షో పూర్తి అయ్యేలోగా పాజిటివ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన మూవీకి అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వస్తుందని పబ్లిక్ మాటల్లో తెలుస్తుంది.. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని టాక్.  మరి ఏ ఓటీటీ లోకి రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..


గేమ్ ఛేంజర్ మూవీ పబ్లిక్ రెస్పాన్స్.. 

ఈ ఏడాది సంక్రాంతికి ముందుగా రిలీజైన ఈ భారీ సినిమాకి తెల్లవారు జాము నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఏ థియేటర్ దగ్గర చూసినా.. ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది.. ఇక రామ్ చరణ్ వన్ మాన్ షో లాగా నడిపించాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. విభిన్న పాత్రల్లో ఒదిగిపోతూ.. నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడని అంటున్నారు. ముఖ్యంగా ఇది గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్‌కి కెరీర్ ఛేంజర్ కూడా అని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. దర్శకుడు శంకర్ మరోసారి తన మార్క్ చూపించి.. కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. కథ, కథనం, నటీ నటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా అద్భుతమైన సినీమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని పబ్లిక్ టాక్.. మొత్తానికి మొదటి షోకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.


ఓటీటీ పార్ట్నర్ లాక్.. 

గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మంచిగానే జరిగిందని సమాచారం.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.127 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిందని టాక్. కేవలం నైజాం ఏరియాలోనే రూ.44 కోట్ల బిజినెస్ చేసిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రామ్ చరణ్ కెరియర్లోనే నైజామ్ ఏరియాలో హయ్యెస్ట్ బిజినెస్ ఇది.. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు రూ.200 కోట్లు వెచ్చించి మరి సౌత్,నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. సినిమా కలెక్షన్స్ పెరిగితే ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది..

ఫుల్ రివ్యూ & రేటింగ్ కోసం Bigtvlive.com ని ఫాలో అవ్వండి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×