BigTV English

Congress: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య చిచ్చుపెడుతున్నది వారేనా?

Congress: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య చిచ్చుపెడుతున్నది వారేనా?

Congress: రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్. ఇది ఓపెన్ సీక్రెట్. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి గట్టిగా ప్రయత్నించడం.. అదికాస్తా రేవంత్ రెడ్డికి రావడం.. అప్పటినుంచీ ఆధిపత్యపోరు మరింత పెరిగింది. కోమటిరెడ్డి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. రేవంత్ మాత్రం పార్టీ అధ్యక్షునిగా కాస్త ఓపికపడుతూనే వస్తున్నారు. వెంకట్ రెడ్డి ఎంతగా గిల్లుతున్నా.. పీసీసీ చీఫ్ మాత్రం ఇప్పటివరకూ ఓపెన్ గా బయటపడింది లేదు.


ఇదే ఛాన్స్ గా ఓ వర్గం వారిద్దరి మధ్య మరింత చిచ్చు పెడుతోందనే అనుమానం కూడా లేకపోలేదు. ప్రస్తుత సమయంలో కోమటిరెడ్డి గురించి ఏ నెగటివ్ మేటర్ వచ్చినా.. అది రేవంత్ రెడ్డి మీదకే పోతుందనే విషయం పసిగట్టిన ఆ వర్గం.. కావాలనే రాజకీయ కుట్రలు చేస్తోందని అంటున్నారు. లేటెస్ట్ గా, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ల వెనుక ఉన్నది రేవంత్ రెడ్డేనంటూ ప్రచారం జరిగిపోతోంది. ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలకు కోమటిరెడ్డి ఫిర్యాదు కూడా చేశారని అంటున్నారు.

ఇటీవలే గాంధీభవన్ లో థాక్రే సమక్షంలో వారిద్దరూ కలిసిపోయారు. రేవంత్, కోమటిరెడ్డిలు పార్టీ బలోపేతంపై చర్చించుకున్నారు. వారి కలయిక చూసి కొందరికి కళ్లు మండినట్టున్నాయని అంటున్నారు. అందుకే, మళ్లీ వారిమధ్య అగ్గిపుల్ల గీచేలా.. నల్గొండలో పోస్టర్లు వేశారని అనుమానిస్తున్నారు. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తే.. అది తన మీదకే వస్తుందనే విషయం రేవంత్ కి తెలీదా? అంత చిన్న లాజిక్ తెలీకుండానే ఆయన పీసీసీ చీఫ్ అయ్యారా? కానే కాదు. ఆ పని రేవంత్ రెడ్డి చేసుండరు అని గట్టిగా వాదిస్తున్నారు. పార్టీ, పార్టీ నేతలు ఎంత ఐకమత్యంగా, బలంగా ఉంటే.. అది పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అంత ప్రయోజనం. అలాంటిది సొంతపార్టీ నేతలనే బద్నామ్ చేసే పని రేవంత్ చేసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ప్లానింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కోమటిరెడ్డి మీద ఫోకస్ చేసేంత సమయం కానీ, ఇంట్రెస్ట్ కానీ ఆయనకు లేదంటున్నారు సన్నిహితులు.


మరి ఎవరు చేసుంటారు? కోమటిరెడ్డి మీద నల్గొండలో పోస్టర్లు ఎవరు వేయించి ఉంటారు? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండు అనుమానాలు ఉన్నాయి.
ఆప్షన్ 1: రేవంత్ ఎదుగుదలను ఓర్వలేని కాంగ్రెస్ లోని ఓ వర్గమే ఇలా చేసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అదే జిల్లాకు చెందిన ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారో ఈ కుట్ర చేసుంటారనే చర్చ నడుస్తోంది. అయితే, ఇందుకు ఛాన్సెస్ తక్కువే అంటున్నారు.

ఆప్షన్ 2: ఇంకెవరు? కాంగ్రెస్ నేతల ఐకమత్యాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎసే ఇలా చేసే అవకాశం ఎక్కువగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అధికార పార్టీనే ఈ మధ్య పోస్టర్ల స్ట్రాటజీ బాగా వర్కవుట్ చేస్తోంది. కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చినప్పుడల్లా వారికి వ్యతిరేకంగా నగరమంతా పోస్టర్లు వేస్తూ ప్రశ్నలతో నిలదీస్తోంది. ఆ కోవలోనే నల్గొండలో కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వేయించింది కూడా బీఆర్ఎస్ పెద్దలేననే డౌట్ బలంగా ఉంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు గాంధీభవన్ లో కలిసి చర్చించుకోవడం.. అందరికంటే గులాబీ పార్టీకే ఎక్కువ నష్టం. అందుకే ఇలాంటి పోస్టర్ పాలి..ట్రిక్స్ ప్లే చేసి.. ఆ నెపాన్ని రేవంత్ రెడ్డి మీదకు డైవర్ట్ చేస్తున్నారని అంటున్నారు.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×