E-Paper
Advertisement

ధర్నాకు పర్మిషన్ ఇవ్వరా? జగిత్యాల ఎస్పీపై ఎంపీ అరవింద్ ఆగ్రహం

ధర్నాకు పర్మిషన్ ఇవ్వరా? జగిత్యాల ఎస్పీపై ఎంపీ అరవింద్ ఆగ్రహం
Advertisement

Dharmapuri Arvind: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ టార్గెట్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 57 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తే, అందులో తెలంగాణకు నాలుగు వచ్చాయని.. జగిత్యాల కొత్త జిల్లా కావడంతో ఇక్కడికి కూడా ఒకటి కేటాయించామని  ఆయన గుర్తుచేశారు. అయితే, స్కూల్ మంజూరై 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించక పోవడంపై అరవింద్ మండిపడ్డారు. అభివృద్ధి పనుల కోసమే పార్టీ మరానని చెప్పుకునే ఎమ్మెల్యే సంజయ్.. మరి కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలాన్ని ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్థలం ఇవ్వట్లేదంటూ సాకులు చెప్పేందుకా మీరు పార్టీ మారారంటూ ఎద్దేవా చేశారు.

ఇదే విషయంలో జగిత్యాల ఎస్పీ తీరుపై కూడా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో కేవలం 8 ఎకరాల్లోనే కేంద్రీయ విద్యాలయం నడుస్తుంటే, జగిత్యాలలో స్థలం కేటాయించక పోవడం వెనుక ఎమ్మెల్యే కుట్ర ఉందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 18న తాను చేపట్టబోయే నిరాహార దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఫైర్ అయ్యారు. ‘ ఎస్పీ గారూ.. సిస్టమ్ మిమ్మల్ని పని చేయించాలి కానీ, మీరు సిస్టమ్‌ను శాసించాలనుకోవద్దు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల లోన్లు, హాస్పిటల్, స్టేడియం నిర్మాణాలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని.. ఎల్లుండి తన దీక్షకు అనుమతి ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

చివరగా కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ.. ఎమ్మెల్యే సంజయ్ నరనరానా బీఆర్ఎస్ రక్తమే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలైన బ్రాండ్ లాంటి సీనియర్ నేత జీవన్ రెడ్డిని వదులుకుని, సంజయ్‌ను చేర్చుకోవడం ఆ పార్టీ అవివేకమంటూ అరవింద్ కామెంట్స్ చేశారు.

Also Read: ఎన్నికల హామీలు ఏమయ్యాయి? నారా లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టాలి.. వెల్లంపల్లి డిమాండ్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×