E-Paper
Advertisement

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!
Advertisement

Charan Arjun:చరణ్ అర్జున్..తెలంగాణా మట్టి నుండి ఎదిగి ఎన్నో సినిమాలకి సంగీతం అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ రైటర్ చరణ్ అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకి అనుబంధం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు.

KCR మీద తనకున్న ఆవేశం

Advertisement

ఏ తల్లి పిల్లోడో,ఏ తల్లి బిడ్దోడో అంటూ KCR కథా గానాన్ని రచిస్తే కనీసం KCR  పదేళ్గలో ఒక్కనాడు గుర్తించలేదని, ఇక KTR కనీసం పిలిచి ఒక శాలువా కప్పిన పాపాన పోలేదని వాపోయాడు.అందుకే రేవంత్ రెడ్డి కోసం రాసిన మూడు రంగుల జెండా పాటలో KCR మీద తనకున్న ఆవేశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.ఇక సినిమాలలో తనకు అవకాశాల ని ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి అన్న ఇప్పటికీ సిద్దంగా ఉన్నాడని , ఎవరికీ ఫోన్ చేయాలి ,మైత్రి రవి వాళ్ళకి చేయాలా అని అడుగుతుంటాడు అని ,కాని ప్రాక్టికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అనంకి తెలీవని అందుకే నేను ఎక్కువగా రేవంత్ అన్నని ఫోర్స్ చేయనని చెప్పుకొచ్చాడు.

రాజకీయ నాయకులతో పరిచయాలున్నా.. 

Advertisement

సినిమా షూటింగ్‌లకు సంబంధించి లొకేషన్లు వంటి అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని. రాజకీయంగా ఎవరితో పరిచయాలు ఉన్నాయన్నది తనకు ముఖ్యం కాదని, సినిమా రంగంలో తన ప్రతిభతోనే ఎదగాలన్నది తన కోరికని స్పష్టం చేశాడు. తనకు రావాల్సిన గుర్తింపు తన పనితోనే రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు..

 2014లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు

ఇక ఈ ఇంటర్వ్యూలో చరణ్ అర్జున్ తన తమ్ముడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా కలిసి పెరిగామని గుర్తు చేసుకున్నారు. అయితే, తన గురించి ఇతరులు చెప్పిన మాటల ప్రభావంతో తమ్ముడు తనకు దూరమయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ్ముడిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో సౌండ్ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇప్పించానని చెప్పారు. అంతేకాదు, అతడిని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనతో 2014లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చేయడానికి కూడా ప్రయత్నం చేశానని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

తనతో కలిసి పనిచేసే వాళ్లు కూడా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకునేవాడినని చరణ్ అర్జున్ చెప్పారు. తాను ఎప్పటికైనా పెద్ద స్థాయికి చేరుకుంటే, తన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా మంచి జీవితం ఇవ్వాలనే ఆలోచన ఉండేదని వివరించారు. తన తమ్ముడి విషయంలోనూ అలాంటి ఆశలే పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు.

అనుకోకుండా తమ్ముడు మరణించడంతో

కానీ కాలం గడిచేకొద్దీ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, తన మనసులోని బాధను కూడా తమ్ముడితో పంచుకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు పరిస్థితులు సర్దుకుంటాయని, తమ్ముడు తిరిగి తనను అర్థం చేసుకుంటాడని ఆశించానని చెప్పారు.

అయితే, అనుకోకుండా తమ్ముడు అనారోగ్యానికి గురై మరణించడంతో తన జీవితంలో తీరని లోటు ఏర్పడిందని తెలిపారు. తనకంటే చిన్నవాడైన తమ్ముడు ఇలా తనను విడిచిపోతాడని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకున్నానని, కానీ తమ్ముడిని కోల్పోయిన బాధ మాత్రం తనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని ఎమోషనల్ అయ్యాడు చరణ్ అర్జున్.

ALSO READ :పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!

Tags

Related News

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

Big Stories

Advertisement
×