E-Paper
Advertisement

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!
Advertisement

Borewell Failure: ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. ఖరీఫ్ సీజన్ లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 41 శాతం వరకు లోటు వర్షపాతం నమోదయింది. దీంతో సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇంటి నిర్మాణాలు, ఇతరత్రా అవసరాల కోసం ప్రజలు ఇష్టారాజ్యంగా బోర్లు వేయిస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతలను పరిగణలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70 శాతానికి పైగా ఫెయిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరికొందరు రైతులు వేసిన పంటలను బతికించుకునేందుకు నీటి ట్యాంకర్ల ద్వారా ప్రస్తుత ఖరీఫ్ లో సాగు చేస్తున్న మిరప పంటలకు నీరు అందిస్తున్నారు.

పెరిగిన బోర్ల తవ్వకం

ప్రస్తుత వర్షాకాలంలో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు తమ పంట పొలాలలో విరివిగా బోర్లను వేస్తున్నారు. బోర్ వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను కొందరు సంప్రదిస్తుండగా టెంకాయ, తంగేడు,రాగి కడ్డీలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ తక్కువ శాతంలో వేసిన బోర్లలో నీళ్లు వస్తున్నాయి. ఎక్కువ శాతం రైతులు బోర్లు వేస్తుండగా నీళ్లు పడకపోవడంతో అప్పుల పాలు అవుతున్నారు. బోర్ లో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు.

Advertisement

Also read: ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?

జలమట్టాలపై అవగాహన కరువు

భూగర్భ జలాల లభ్యతపై ప్రతి మండలంలో అధికారులు ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి అంతకుముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం అధికారులు తక్కువ నీళ్లు ఉన్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న గ్రామపంచాయతీలలో కొత్త బోర్ బావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఈ పరీక్షలు నిర్వహించడం లేదు. నిబంధన ప్రకారం బోర్లు బావులు అవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ భూగర్భ జలాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నడంతో రైతులు నీటి కోసం బోర్లను తవ్విస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఆర్థికంగా మంచి డిమాండ్..

Advertisement

బోర్ బండి యజమానులకు, వివిధ పద్ధతులలో నీటిని కనుగొనే వారికి ప్రస్తుత సీజన్ లో ఆర్థికంగా మంచి డిమాండ్ ఉండగా రైతులు అప్పులు చేసి బోర్లు వేయిస్తుండగా మీరు పడకపోవడంతో కన్నీరు అవుతున్నారు వేసిన పంట చేతికి రాక ఇప్పటికే పెట్టుబడులు పెట్టి కాస్త కోస్తా దిగుబడి వస్తుందన్న ఆశతో మిరప సాగు రైతులు అప్పులు చేసి పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నా అడుగంటిన జలాలతో నీరు రాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేసవిని తలపిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో పంటలు గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో పంటల సాగుకు విత్తనాలు, కూలీలు, ఫర్టిలైజర్, క్రిమిసంహారక మందులు ,సస్యరక్షణ చర్యలకు అయిన ఖర్చులు ఎలా తిరిగి పొందాలో తెలియక భవిష్యత్తుపై రైతులు బెంగ పెట్టుకున్నారు.

Also read: 20 ఏళ్లుగా రగులుతున్న ప్రాణహిత-తుమ్మిడిహట్టి బ్యారేజీ.. ఈ సారైనా మోక్షం దక్కేనా..?

Tags

Related News

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

20 ఏళ్లుగా రగులుతున్న ప్రాణహిత-తుమ్మిడిహట్టి బ్యారేజీ.. ఈ సారైనా మోక్షం దక్కేనా..?

ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ సమరశంఖం.. నవంబరు 1న భారీ బహిరంగ సభ!

తెలంగాణలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!

Big Stories

Advertisement
×