E-Paper
Advertisement

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?
Advertisement

Mettu Sai Kumar: బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్‌రావు లక్ష్యంగా తెలంగాణ ప్రాంత మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య మాజీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ శ్రేణులపై, హరీష్ రావు వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

ప్రతిరోజూ అబద్ధాలు..

బీఆర్‌ఎస్’ అంటే బలాదూర్, బెకార్, బట్టేబాజ్ రాష్ట్ర సమితి అని మండి పడ్డారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ఆగం చేసిన దుర్మార్గులు, ఇప్పుడు సుద్దులు చెబుతున్నారని మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యారు. అబద్ధాలు చెప్పడంలో హరీష్ రావు తన మామ కేసీఆర్‌ను మించిపోయారని, ప్రతిరోజూ వంద నుంచి వెయ్యి అబద్ధాలు మాట్లాడతారని, ఆయన నోటి నుంచి ఏనాడూ నిజం రాదని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టుల విఫలానికి కేసీఆర్, హరీష్ రావులిద్దరే కారణమని, ఆ పాపం వారిద్దరూ మోయాల్సిందేనని అన్నారు.

కమీషన్ల కోసం..

Advertisement

కేసీఆర్‌కు ఎంత పాపం ఉందో హరీష్ రావుకు కూడా అంతే భాగం ఉందన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి మెడిగడ్డ ప్రాజెక్టును కూల్చేశారని ఆరోపించారు. “గతంలో మీరు చేసిన పాపాలను బిఆర్‌ఎస్ నాయకులే ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతోనే నిన్న మిమ్మల్ని మెడిగడ్డకు పోనిచ్చాం” అని మెట్టు సాయి స్పష్టం చేశారు.

Also read: అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

Tags

Related News

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

20 ఏళ్లుగా రగులుతున్న ప్రాణహిత-తుమ్మిడిహట్టి బ్యారేజీ.. ఈ సారైనా మోక్షం దక్కేనా..?

ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ సమరశంఖం.. నవంబరు 1న భారీ బహిరంగ సభ!

తెలంగాణలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!

FCI బియ్యం సరఫరాలో భారీ అక్రమాలు.. 14 మంది మిల్లర్లు అరెస్ట్!

Big Stories

Advertisement
×