E-Paper
Advertisement

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!
Advertisement

ACB Arrests: అధికారికంగా సాయ పడేందుకు లంచాలు తీసుకున్న ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భాగీరథీపేట్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ప్రాజెక్ట్ (పీఎంకేఎస్‌వై 2.0)లో సతీష్ రెడ్డి ప్రాజెక్ట్ ఆఫీసర్‌ గా పని చేస్తున్నారు. ఇక్కడే రాజు టెక్నికల్ ఆఫీసర్‌ గా ఉద్యోగం చేస్తున్నారు. కాగా, పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపులు, తదుపరి పనుల కేటాయింపుల కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారు. తాము అడిగినంత కమీషన్ ఇవ్వకపోతే పెండింగ్ బిల్లులు ప్రాసెస్ కావని, కొత్త పనులు కూడా కేటాయించమని బెదిరింపులకు పాల్పడ్డారు. చేసిన పనుల బిల్లుల విలువలో ఏకంగా 10నుంచి 25 శాతం వరకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: పేదరికంలో బతికే వ్యక్తికి భవిష్యత్తు ముందే తెలిసే వరం… రాత్రికి రాత్రే రచ్చ… తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Advertisement

దాంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు జరిపిన విచారణలో సతీష్ రెడ్డి, రాజు కలిసి కాంట్రాక్టర్ నుంచి యూపీఐ ఐడీల ద్వారా రూ. 39.17లక్షల రూపాయలను ఆన్‌ లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నట్టు తేలింది. దీనికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌ మెంట్లు, వాట్సాప్ చాట్ రికార్డులను కూడా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు అందజేశాడు. అంతేకాకుండా ఏడో బిల్లుకు సంబంధించి కొలతలు నమోదు చేయడానికి, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి మరో 25 శాతం ఇవ్వాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తేలింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు సతీష్ రెడ్డి, రాజులను అరెస్ట్ చేశారు.

Also Read: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

Tags

Related News

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

Big Stories

Advertisement
×