E-Paper
Advertisement

Cyber ​​Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ సక్సెస్.. మాజీ జేడీ దంపతులను మోసగించిన బీహార్ ముఠా అరెస్ట్

Cyber ​​Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ సక్సెస్.. మాజీ జేడీ దంపతులను మోసగించిన బీహార్ ముఠా అరెస్ట్
Advertisement

Cyber ​​Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని భారీగా సొమ్ము పోగొట్టుకోవడం సామాన్యులకే కాదు.. సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా ఎదురవుతున్న ముప్పు అని మళ్లీ నిరూపిస్తోంది ఈ సంఘటన.  మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనాారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురై ఏకంగా రూ. 2.58 కోట్లు పోగొట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గత ఏడాది నవంబర్ నెలలో ఊర్మిళ వాట్సప్ నెంబరుకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ఓ లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే.. అనూహ్యంగా 500 రెట్లు లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో.. ఆమె తన భర్త లక్ష్మీనారణ సహాయం తీసుకున్నారు. అయితే నేరగాళ్లు పంపిప యాప్, వారు చూపించిన తప్పుడు లాభాల గ్రాఫ్‌లను చూసి నిజమని నమ్మిన దంపతులు, డిసెంబర్ 24 నుండ జనవరి 5 మధ్య కేవలం కొద్ది రోజుల్లోనే..        19 విడతలుగా రూ. 2.58 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు.

Advertisement

పెట్టుబడి పెట్టిన తర్వాత సుమారు రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు సైబర్ నేరగాళ్లు యాప్‌లో చూపించారు. అయితే.. ఆ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు.. ట్యాక్సుల పేరుతో మరికొంత సొమ్ము చెల్లించాలని వారు కోరారు. దీంతో అనుమానం వచ్చని లక్ష్మీనారాయణ దంపతులు తాము మోసపోయామని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి.. ఈ నేరానికి పాల్పడిన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 45 లక్షల నగదును సీజ్ చేశారు.

ALSO READ:  ఇండియా, ఈయూ ట్రేడ్ డీల్ కుదిరింది.. ఈ డీల్‌ తో భారత్ జరగే లాభం ఇదే!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×